విశాఖ జిల్లాలో 1.26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన నిన్న సీఎంతో కలిసి ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, స్థానిక మాజీ శాసనసభ్యులు గత 5 సంవత్సరాల్లో పట్టుమని 5గురికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే అదీప్ రాజు విమర్శించారు. కానీ తాము మాత్రం కేవలం పెందుర్తి నియోజకవర్గంలో రూరల్, అర్బన్ కలుపుకొని సుమారు 70 వేల మందికి మనం ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు.
తాము పట్టాలు ఇచ్చే వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారని ఎమెల్యే అంటున్నారు. టీడీపీ నేత బండారు సత్యనారాయణ సొంత గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు భార్య గొంప సునీతకు కూడా పట్టా ఇచ్చామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు. అలాగే టీడీపీ బీఫాంతో ఎంపీటీసీగా నామినేషన్ వేసిన వాడచీపురుపల్లి అభ్యర్థికి కూడా పట్టా ఇచ్చామని ఎమ్మెల్యే అదీప్‌రాజు గుర్తు చేశారు. 70 వేలు పట్టాలు.. అంటే ఇంటికి ముగ్గురు అనుకున్నా.. 2 లక్షల మందికి శాశ్వత నివాసం కల్పించామని ఎమ్మెల్యే అదీప్‌రాజు అంటున్నారు. చంద్రబాబు మాత్రం పేదల భూములు తీసుకొని రియలెస్టేట్ వ్యాపారం చేయాలని చూసారని విమర్శించారు. సీఎం వైయస్ జగన్ ఆ భూములను పేదలకు పంచి శాశ్వత నివాసాలు కల్పిస్తున్నారని పొగిడారు. అయితే.. ఎప్పుడో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని దుర్మార్గపు టీడీపీ కేసులు వేసి ఇన్నాళ్లూ అడ్డుకుందని ఎమ్మెల్యే అదీప్‌రాజు అన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి