ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాల్సిందే అని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. మూడు నెలల్లోనే అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇవ్వాలని.. ఆరు నెలల్లో రాజధానిని అభివృద్ధి చేయాలని డెడ్ లైన్ కూడా విధించింది. అయితే.. ఈ తీర్పును జగన్ సర్కారు లైట్‌ గానే తీసుకుంది. ఈ విషయంపై ఏకంగా అసెంబ్లీలోనే ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వం ప్రకటించింది.


అయితే.. ఎంతైనా కోర్టు తీర్పును మొత్తం పక్కకు పెట్టేస్తే ప్రమాదం కనుక.. ఏదో చేస్తున్నాం.. అన్నట్టుగా కొన్ని కంటితుడుపు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఇప్పడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అభివృద్ధికిని నిధుల్లేవు కనుక.. ఆ రాజధాని భూములనే అమ్మి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణ పనుల కోసం మొదటి విడతగా 15 ఎకరాలను విక్రయించేందుకు సీఆర్‌డీఏకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఈ మేరకు ఈనెల  6వ తేదీన జీవో ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు ఈ జీవో వెలుగు చూడటంతో కలకలం రేగుతోంది. అంతే కాదు.. ఇలా క్రమంగా దశలవారీగా 500 ఎకరాలను విక్రయించాలని జగన్ సర్కారు భావిస్తోందంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.


అమరావతి ప్రాంతంలోని రెండు చోట్ల మొత్తం 15 ఎకరాల్ని ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించాలని జగన్ సర్కారు నిర్ణయించిందట. ఈ మేరకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ఈ నెల ఆరో జీవో ఇచ్చిందట. అయితే.. ప్రభుత్వం ఇటీవలఅనేక జీవోలను ఈ-గెజిట్‌ పోర్టల్‌లో ఉంచడం లేదు. అందువల్ల ఇది వెలుగులోకి రావడానికి ఇంత సమయం పట్టింది. కాజ-గుండుగొలను బైపాస్‌ రహదారి పక్కనే నవులూరు గ్రామం వద్ద 10 ఎకరాలు ఈ అమ్మే భూముల్లో ఉన్నాయట. ఇక్కడ అయిదేసి ఎకరాల ప్లాట్లు రెండు ఉన్నాయట. అలాగే  సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పక్కనే పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలు అమ్ముతారట. ఇక్కడ రెండేసి ఎకరాల ప్లాట్లు రెండు అమ్ముతారట.


మరింత సమాచారం తెలుసుకోండి: