ఏపీలో మద్యం బ్రాండ్లపై వివాదం కొనసాగుతోంది. కొన్ని బ్రాండ్ల మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని టీడీపీ ఆరోపించింది. దీనిపై కొన్నిటెస్టులు కూడా చేయించామని టీడీపీ కొన్ని రిపోర్టులు బయటపెట్టింది. అయితే అదంతా అబద్దమంటూ మద్యం డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. అసలు టీడీపీ చేయించిన టెస్టులు సరైన ఫార్మాట్‌లో లేవని.. తిప్పికొట్టారు. కావాలంటే ఎవరైనా ఫార్మాట్‌లో టెస్టులు చేయించుకోవచ్చని సవాల్ విసిరారు.


దీనిపై టీడీపీ మాత్రం పట్టు వీడటం లేదు. ఆంధ్రా గోల్ద్, సిల్వర్ స్ట్రైప్స్, 9సీ హార్స్ మద్యం బ్రాండ్ లలో విషం లేదని చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేక మాపై విషప్రచారం చేస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అంటున్నారు. ఆంధ్రా గోల్ద్, సిల్వర్ స్ట్రైప్స్, 9సీ హార్స్ మద్యం బ్రాండ్ లు ఇప్పుడెందుకు ప్రభుత్వ దుకాణాల్లో కనిపించట్లేదని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నిస్తున్నారు.


తెలుగుదేశం ఆధారాలు బయటపెట్టాకే ఇవి కనిపించకుండా పోవటం వెనక ఆంతర్యం ఏంటని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నిస్తున్నారు. ఆయా విషం ఉందని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుందని.. విషాన్ని కూడా బంపర్ ఆఫర్ లో ప్రజలకు అమ్మిన ప్రభుత్వం ఇది అంటూ టీడీపీ నేత వంగలపూడి అనిత విమర్శించారు. ప్రజలకు విషం పోస్తూ మేం విషం కక్కుతున్నామని సజ్జల చెప్పటం సిగ్గుచేటన్న టీడీపీ నేత వంగలపూడి అనిత.. డబ్బులిచ్చి విషాన్ని కొనుక్కుని ప్రాణాలు తీసుకునే దౌర్భాగ్యం ఏపీలోనే ఉందంటూ మండిపడ్డారు.


ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్ లు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు అమ్మట్లేదని టీడీపీ నేత వంగలపూడి అనిత నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 100డిస్టలరీలు రిజిస్ట్రయితే కేవలం 16టికీ మాత్రమే అనుమతులు ఇచ్చినట్లు స.హ.చట్టం ఇచ్చిన సమాధానానికి ఏం చెప్తారని టీడీపీ నేత వంగలపూడి అనిత ప్రశ్నిస్తున్నారు. అవి జగన్ రెడ్డి బినామీ కంపెనీలు కాబట్టే వాటికి మాత్రమే అనుమతులిచ్చారని టీడీపీ నేత వంగలపూడి అనిత అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: