
నాలుగు సంవత్సరాల్లో ఏమి చేయని వారు ఆఖరి సంవత్సరం లో పెట్టుబడిదారులు ఎందుకు వచ్చినట్టని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. గడిచిన 4 ఏళ్లలో ఏపీలో సహజ వనరులు ఉన్నాయని పెట్టుబడిదారులకు తెలియదా? అన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి .. 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు కనీసం ఆంధ్రుల ఆత్మాభిమానం అయిన స్టీల్ ఫేక్టరీ ని కాపాడితే అదే పది వేలని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తెచ్చి ఉంటే పెట్టుబడిదారులు ఏపీకి క్యూ కట్టేవాళ్ళు సదస్సు అవసరం లేదని.. హోదా తీసుకురావడం లో విఫలమయ్యారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు.
విదేశీ పెట్టుబడులు గడిచిన 4 ఏళ్ల లో దేశవ్యాప్తంగా వచ్చింది 11 లక్షల కోట్లు అందులో ఆంధ్రకు వచ్చింది 4 వేల కోట్లు మాత్రమేనని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయంటే నమ్మేది ఎలా? అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. సదస్సులో రాజధాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి .. అది విశాఖ సదస్సా లేక పెట్టుబడిదారుల సదస్సా.. అని ప్రశ్నించారు.
పెట్టుబడి పెట్టేవాళ్లకు రాజధానితో సంబంధం ఏంటి, ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ పెడతారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అభిప్రాయపడ్డారు. అందరికి రాజధాని లేని రాష్ట్రం అని చెప్పడానికా ??ఇంకా ఏ ముఖం పెట్టుకుని పెట్టుబడులు పెడతారని.. ప్రస్తుతమైన అసందర్భమైన, అసమంజసమైన ప్రస్తావన ఎందుకని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నిలదీశారు.