
అణ్వస్త్రాలు గాని, అణ్వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ గాని వాళ్ళ చేతుల్లో ఉంటే రేపు పొద్దున్న ఏ తిరుగుబాటుదారుడు గానీ, టిటిపి లాంటి వాళ్ళు ఎవరైనా దాడికి వస్తే ఈ అణ్వాయుదాలనేవి వాళ్ళ చేతిలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు ఇతర ఉగ్రవాద సంస్థలకు అమ్ముకుంటే ఎంత ప్రమాదం. మొన్న అమెరికా వాడు వదిలేసి వెళ్లిపోయిన ఆయుధాలను వీళ్లు తీసుకోవడం వల్లనే కదా కాశ్మీర్లో గాని, కొన్ని దేశాల్లో గాని ఈ విధ్వంసాలన్నీ కూడా. అలాంటి పరిస్థితే వచ్చేస్తుంది.
చెప్పాల్సి వస్తే పాకిస్తాన్ లో టిటిపి వాడుతున్న ఆయుధాలు కూడా అమెరికా వాళ్ళవే. రేపొద్దున్న అదే జరుగుతుంది. ఇప్పుడు లిబియా లో పరిస్థితి ఏమిటంటే అక్కడ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వాన్ని , అధికారకంగా ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని టర్కీ గుర్తించింది. దానికి తిరుగుబాటు అయిన సైనిక అధికారి ప్రభుత్వాన్ని అగ్ర రాజ్యాలు గుర్తించాయి.
ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అణ్వాయుధాలు తయారుచేయగల సామర్థ్యం ఈ తిరుగుబాటుదారుల చేతుల్లోకి రావడం ప్రమాదం అయింది. ఐ.ఏ.ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ సంస్థ ఏదైతే ఉందో అక్కడ, శుద్ధి అయిన యురేనియం పది రౌండ్లు ఆయుధాలు తయారు చేయగలిగిన 21/2టన్నుల యురేనియం రేడియో లాజికల్ థ్రెట్ ఉందో అది లిబియా నుండి మాయమైంది. గడాఫీ 2011లో మరణించిన తర్వాత లిబియా తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది.