మహిళలు రోడ్డెక్కి మేం చదువుకుంటాం.. మాకు నిర్బంధం వద్దు అని నెత్తి నోరు కొట్టుకున్న షరియా చట్టం ప్రకారం మహిళలు బయటకు రాకూడదు. చదువు కోవడం నిషేధం అని వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు తాలిబాన్లు. అడ్డుగోలుగా దోచుకోవడం, అప్గానిస్తాన్ లో రాళ్లు వేయడం, తగలబెట్టడం, అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి వేయడం లాంటి పనులను తాలిబాన్లు చేస్తున్నారు. ఇలా ఒక్కటేమిటి చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు అక్కడి ప్రజలను గురి చేస్తున్నారు. పాలన చేతకాక ప్రజలపై దాడులు దిగుతున్నారు.
కనీసం పట్టణాల్లో ట్రాఫిక్ ను ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. పన్నులు ఎలా వసూలు చేయాలో తెలియక తుపాకులు పట్టుకుని ఇష్టారీతిన బెదిరించి వసూలు చేస్తున్నారు. ఇతరులను చంపినట్టు, భయపెట్టినట్లు, దౌర్జన్యాలు చేస్తూ రాక్షసానందం పొందినట్లు కాదు ప్రజలకు పరిపాలన అందించడం అంటే. దానికి అధికార యంత్రాంగం ఉండాలి. దౌత్య పరమైన విధాన మార్గాలు అవసరం. వివిధ దేశాలతో సత్సంబంధాలు మెరుగ్గా ఉండాలి. దేశంలో ప్రజల భద్రత, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం లాంటి సౌకర్యాలు అందరికీ చేరువ కావాలి. ఇలాంటి ఎన్నో చేయాల్సిన అవసరముంటుంది.
దాడులు చేసి పాలనను లాక్కోగానే సరిపోదు. ఆ తర్వాత సరైన పాలన చేసి ప్రజలకు మంచి చేయడంలో అసలైన సవాల్ ఉంటుంది. ప్రస్తుతం అప్గాన్ లో తాలిబాన్ల పాలన గాడి తప్పుతోంది. ప్రజలకు ఏవీ కావాలో అవి దరి చేరడం లేదు. అనాగిరకమైన పరిపాలన కొనసాగుతోందని చెప్పొచ్చు.