
రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని చేస్తుంది. ఉపాధి హామీ పథకం, రేషన్, అంగన్ వాడీ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ గతంలో చంద్రబాబు ఏనాడు కూడా కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందని చెప్పలేదు. లోకేశ్ అన్న మాటలను చంద్రబాబు ఏకీభవిస్తారా? లేక లోకేశ్ ను మందలిస్తారా.. చూడాలి. ఎప్పుడైనా సరే గ్రామ పంచాయతీలకు సంబంధించి పల్లెటూర్లకు కేంద్రం నుంచి 80 రూపాయాల నిధులు వస్తే రాష్ట్రం నుంచి కేవలం 10 నుంచి 20 రూపాయాలు వస్తాయన్నది నిజం.
కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విషయాన్ని బయట పెట్టదు. కేవలం మేం మాత్రమే అభివృద్ధి చేశామని గొప్పలకు పోతుంది. కాబట్టి లోకేశ్ చెప్పిన ఈ విషయాన్ని చంద్రబాబు ఎలాగో అంగీకరించే పరిస్థితిలో ఉండరు. పోనీ వైసీపీ నిజమని చెబుతుందా అంటే అధికారంలో ఉన్న పార్టీ అసలు అలా అంటే మొదటికే మోసం వస్తుంది.
ఎక్కువ డబ్బులు కేంద్రం పెట్టిన తర్వాత మీరేం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తారు. దీన్ని బీజేపీ ఆంధ్రలో క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడే కనిపించడు. అంతా విపులంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించగల సామర్థ్యం ఉన్న నాయకుడు ఆంధ్ర బీజేపీలో లేరని చెప్పొచ్చు లేకపోతే లోకేశ్ మాట్లాడిన మాటల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారే.