
ఈ అమర్ రాజా కంపెనీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందినదే అని అందరికీ తెలిసిన విషయమే.
గల్లా అరుణ కూడా గతంలో మంత్రిగా పని చేసిన వారే . అయితే ఈ మధ్య ఓ సమావేశంలో గల్లా అరుణ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో కంపెనీ పెడతామని ప్రకటించారు. అది కేటీఆర్ పాల్గొన్న సమావేశంలో ప్రకటించారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని గల్లా జయదేవ్ ఫ్యామిలీ నమ్మడం లేదా అనే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని రోజులు వైసీపీ వారిపై టీడీపీ నాయకులు మీకు చేతకాకనే అమర్ రాజా కంపెనీ హైదరాబాద్ కు వెళ్లిపోయిందనే తీవ్ర విమర్శలు చేశారు.
కానీ గల్లా అరుణ మాత్రం మహబూబ్ నగర్ లో ఇళ్లు కొనుక్కుంటాం. అక్కడే వ్యాపారం కొనసాగిస్తాం అని ప్రకటిస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు. టీడీపీ అధికారంలోకి రాదని ఆమె భావించారా.. లేక వచ్చినా ఆంధ్ర కంటే తెలంగాణ వ్యాపారానికి బెటర్ అని అనుకుంటున్నారా టీడీపీ నాయకులు చెప్పాలని వైసీపీ నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
అసలు వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఎక్కడైతే అనువుగా ఉంటాయో అక్కడే పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. కానీ అమర్ రాజా కంపెనీ ఆంధ్రలో పెట్టుబడి పెట్టలేదని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఏడాది లోగా ఎన్నికలు జరగబోతున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తుంది. మీరు ఆంధ్రలోనే పెట్టుబడులు పెట్టండని ఎందుకు చెప్పలేక పోతున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు వేరు వ్యాపారాలు వేరని గుర్తించుకోవాలని సూచిస్తున్నారు.