ఉత్తరప్రదేశ్ లో ఎస్సీ, బీఎస్సీలు పోటీపడి మరీ గెలిచే ప్రాంతాల్లో బీజేపీకి దాదాపు 70కి పైగా ఎంపీ స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఏకంగా రాహుల్ గాంధీనే సృతి ఇరానీ ఓడించారంటే బీజేపీకి ఎంతటి బలం చేకూరిందో తెలుసుకోవచ్చు. దీనకంతటికీ కారణం నరేంద్ర మోదీ యూపీ లోని వారణాసి నుంచి ఎంపీగా నిల్చొవడం. భారీ మెజార్జీతో గెలవడం. అయితే 2024 లో జరిగే ఎన్నికల్లో దక్షిణాది నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు.
తమిళనాడు, తెలంగాణలో ఈ సారి ఎక్కువ స్థానాల్లో గెలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అల్రడీ బీజేపీకి పట్టు ఉంది. కేరళ నుంచి మొదట పోటీ చేయాలని అనుకున్న మోదీ రూటు మార్చి తమిళనాడులోని కొయంబత్తూరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంస్థాగతంగా కూడా బీజేపీ బలంగా ఉంది. అయితే తమిళనాడులోని కొయం బత్తూరు, కన్యాకుమారి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతాల్లో ఇప్పటికే బీజేపీకి కాస్త పట్టుండటం సానుకూలంశం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులే గెలవడం కలిసొచ్చింది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా అంగీకారం తెలిపినట్లు వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి మోదీ పోటీ చేయడం వల్లే యూపీలో బీజేపీకి అనూహ్యంగా ఎక్కువ సీట్లు వచ్చాయి. దీంతో కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే కాకుండా పార్టీకి దక్షిణాదిలో వైభవం తీసుకొచ్చేలా మోదీ ప్లాన్ సిద్ధం చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి