
వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.13,500 లను పంట సాయంగా ఏటా అందిస్తోంది. ఇందులో కేంద్రం వాటా రూ. 6000 ఉండగా.. మిగతా రూ.7500లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. గత ఎన్నికల్లో సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమికి రైతులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.
అయితే తాజాగా జగన్ సర్కారు పై కూడా రైతులు కొంత వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు హయాంలో రాయితీపై ఇచ్చే సోలార్, బిందు సేద్య పరికరాలు, విద్యుత్తు ఉపకరణాలు లాంటివి అందరికీ లభించేవి. వీరంతా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ వచ్చేవి. వైసీపీ హయాంలో వీటి ఊసే లేదు.
రైతుల కోసం పెట్టిన ఆర్బీకే కేంద్రాలు నిరుపయోగంగా మారాయన్న విమర్శలున్నాయి. అక్కడ పనిచేసే సిబ్బంది బాధ్యతాయుతంగా పని చేస్తున్నారని.. నాలుగైదు రోజలకు ఓ సారి వస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ జలకళతో పాటు కేంద్ర పథకాలు రావడం లేదు. చంద్రబాబు హయాంలో అమలైన కేంద్ర పథకాలు ప్రస్తుతం ఉన్నాయి. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా వాటిని అమలు చేస్తున్నారు. కానీ మన దగ్గర అమలు పరచడంలో అధికారులు, మంత్రులు విఫలమవుతున్నారు.