మెగాస్టార్ చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి మనందరకీ తెలిసిందే. అయితే ఆయన సడెన్ గా ఒక పొలిటికల్ పార్టీకి విరాళం ఇచ్చారు. ఇది నిజంగా రాజకీయంగా సంచలనమే. తమ్ముడు పార్టీ జనసేనకి మెగాస్టార్ భారీ విరాళాన్ని ప్రకటించారు. దీంతో పవన్ కి కావాల్సినంత బూస్ట్ ఇచ్చారు.


ఏపీలో జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో బరిలో ఉంది. ఆ పార్టీకి ఇప్పటి వరకు ఎన్ని విరాళాలు అందాయో.. ఎవరు ఇచ్చారో తెలియదు. పవన్ మాత్రం స్వయంగా తన పార్టీకి తానే రూ.10 కోట్లను విరాళంగా ఇస్తూ ప్రకటన చేశారు. ఆయన పార్టీకి ఫండ్ ఇచ్చిన తర్వాత ఆయన అన్నయ్య మెగాస్టార్ రూ.5 కోట్లు ఇవ్వడం విశేషం. ఈ  సందర్భంగా పవన్ చేతికి ఆ చెక్ ను చిరంజీవి స్వయంగా అందజేశారు.


పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకముందే ప్రజల మేలు కోసం తన సొంత సొమ్మును ఖర్చు చేస్తున్నారని మెగా బ్రదర్ ప్రశంసించారు. అంత కాదు రైతులకు సాయంగా తన పారితోషికాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ స్థాపించి పదేళ్లు కావొస్తోంది. ఇప్పటి వరకు  ఆ పార్టీకి చిరంజీవి బాహాటంగా మద్దతు ప్రకటించింది లేదు తమ్ముడు ఎంచుకున్న రంగంలో రాణించాలని మాత్రమే కోరుకున్నారు.


ఈసారి ఎన్నికలు జనసేనకు అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ ను మెగా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేస్తే ఆయన పార్టీకి అది నైతికంగా కలిసి వస్తుందని విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు. ఇక అన్నయ్య విరాళం అందజేసిన అనంతరం తమ్ముడు ఆయన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. షూటింగ్ స్పాట్ లో ముగ్గురూ కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు చిరంజీవి బాహాటంగా మద్దతు ఇవ్వడంతో అంతా జై చిరంజీవ అంటున్నారు. ఇది జనసేనకు మంచి బూస్ట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: