ముఖ్యమంత్రి పీఠం దక్కినా... రేవంత్ రెడ్డి బుద్ది మాత్రం పెరగలేదని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్ కు లేదని రేవంత్ అంటున్నడని.. ఎవరికి సమాజంలో జీవించే హక్కులేదో ప్రజలను అడుగుదమా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. కొడంగల్ లేదా కొండారెడ్డిపల్లిలో అడుగుదమా?.. తెలంగాణ సమాజమంతా రేవంత్ రెడ్డిని ఛీ కొడుతోంది... దుమ్మెత్తి పోస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.


రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మీద ఉన్న కోపాన్ని కేసీఆర్ మీద చూపిస్తే ఎలా?.. కేసీఆర్ ను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్ లో ఉంటారేమో?.. కానీ, తెలంగాణ చరిత్ర గతిని మార్చిన కెసీఆర్ స్థానమే ప్రజల హ్రదయాల్లో పదిలం .. రేవంత్ రెడ్డి ఇదే భాష కొనసాగించాలనుకుంటే జనజీవన స్రవంతిలో ఉండటానికి అర్హుడు కారు.. తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ ను బహిష్కరిస్తారా? సూర్యుడి మీద ఉమ్మేస్తే ఏమవుతుందో తెలుసు కదా అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.


మా బహిష్కరణ కాదు గానీ, రేవంత్ రెడ్డి నిష్క్రమణకు సమయం దగ్గర పడుతోందన్న మాజీ మంత్రి హరీశ్ రావు.. సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తే ప్రజలను పట్టపగలు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని చేయాలి.. ప్రజాస్వామ్య పంథా లోనే ప్రజలు రేవంత్ రెడ్డికి దిమ్మదిరిగే సమాధానం ఇస్తరు... కులగణన పేరు మీద కుటిల రాజకీయం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.. సర్వే సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నేతలే తూర్పార పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.


రేవంత్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరినీ ఒప్పించి సర్వేలో ఖచ్చితమైన గణాంకాలు వచ్చాయని చెప్పించాలని.. రేవంత్ రెడ్డి కులగణన సర్వే... ఎన్నికల గిమ్మిక్కే, ఫెయిల్యూర్ మ్యాజిక్కే .. ఓ వైపు సర్వే కరెక్ట్ అంటారు... మరోవైపు రీసర్వే అంటారు.. సీఎం పదవి స్థాయిని దిగజార్చవద్దు.. ప్రశాంత తెలంగాణ లో ఫ్యాక్షన్ వాతావరణాన్ని సృష్టించాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ సఫలం కావని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: