
మొదటి షరతుగా, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కమిటీ సూచించింది. గోదావరి బేసిన్ నుంచి నీటిని మళ్లించే ప్రతిపాదనకు నీటి లభ్యత కీలకం కావడంతో, ఈ అధ్యయనం తప్పనిసరిగా ఉండాలని నొక్కి చెప్పింది. ఈ అంశంపై స్పష్టమైన నివేదిక లేకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదని కమిటీ స్పష్టం చేసింది.
రెండో షరతుగా, 1980 గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు ఉందన్న ఆరోపణలను పరిశీలించాలని ఈఎసి తెలిపింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ఆధారాలను సమర్పించాలని సూచించింది. ట్రిబ్యునల్ నిబంధనలకు అనుగుణంగా ప్రాజెక్టు ఉండేలా చర్యలు తీసుకోవాలని కమిటీ ఒత్తిడి చేసింది.మూడవ షరతుగా, పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారీకి ముందు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీపై స్పష్టత కోసం కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోవాలని కమిటీ నిర్దేశించింది. ఈ మూడు షరతులను పూర్తి చేసిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం సాధ్యమని ఈఎసి తేల్చిచెప్పింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు