వాస్తవంగా ముందుగా ఈ సినిమాకి డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తారని ప్రకటించక కొన్ని కారణాల చేత సుందర్ ఈ సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో డైరెక్టర్ సిబి చక్రవర్తి పేరు వైరల్ గా మారింది. అయితే సిబి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో తాజాగా రజనీకాంత్ ఈ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్ అని పూర్తి చేసుకున్నారు. ఇక కేవలం సినిమాకు సంబంధించి కొన్ని పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్టు సెట్స్ మీదకి తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక రజనీకాంత్ కూడా ఈసారి చాలా సరి కొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారని డైరెక్టర్ సిబి చక్రవర్తి కూడా తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్తో అలరించడానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారనేట కు వినిపిస్తోంది. రజనీకాంత్ తో సినిమా అయిపోగానే డైరెక్టర్ సిబి చక్రవర్తి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అది కూడా హీరో నానితో ఒక భారీ చిత్రాన్ని చేయబోతున్నట్లు వినిపిస్తున్నాయి. మరి అఫీషియల్ గా డైరెక్టర్ సిబి చక్రవర్తి తో రజనీకాంత్ సినిమా గురించి ప్రకటిస్తారేమో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి