దక్షిణాది సినీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న హీరోయిన్ సమంత. 2023లో ‘ఖుషి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన తర్వాత, అనారోగ్య సమస్యలు మరియు వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు రెండున్నర ఏళ్లు వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చింది. అభిమానులు “సామ్ సినిమా ఎప్పుడు?” అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' అంటూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది.


రాజ్ నిడిమోరు నిర్మాణంలో.. నందిని రెడ్డి!
సమంతకు ‘ఓ బేబీ’ వంటి భారీ విజయాన్ని అందించిన దర్శకురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ మేకర్ రాజ్ నిడిమోరు నిర్మాణ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమా, మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. గతంలో సమంత - నందిని రెడ్డి కాంబోకు ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు చూస్తుంటే, ఈ సినిమాతో సామ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయం అనిపిస్తోంది.


చీరకట్టులో ‘మహాలక్ష్మి’లా సమంత.. కొత్త లుక్ వైరల్!
ఈ సినిమాలో సమంత లుక్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కెరీర్ ఆరంభంలో గ్లామర్ పాత్రలతో అలరించిన సామ్, ఇప్పుడు పూర్తిగా పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటోంది. ‘మా ఇంటి బంగారం’లో సమంతను నిండైన చీరకట్టులో, ఒక మధ్యతరగతి గృహిణిలా చూడబోతున్నాం. టీజర్ మరియు పాటల్లో ఆమె లుక్ చూస్తుంటే, పక్కా ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. ఆమె చీరకట్టు ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.



కొత్త జీవితం.. రెట్టింపు ఉత్సాహం!
సమంత జీవితంలో గత రెండేళ్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆరోగ్య సమస్యలు ఒకవైపు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు మరోవైపు ఆమెను కృంగదీశాయి. అయితే, ఆ కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి, ఇటీవల ఆయన్ను వివాహం చేసుకోవడం ద్వారా సమంత కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు వ్యక్తిగత జీవితం గాడిన పడటంతో, మళ్ళీ తన ఫిల్మ్ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. అందుకే ఈ సినిమా ప్రమోషన్లలో సమంత గతంలో కంటే ఎక్కువ ఉత్సాహంగా పాల్గొంటోంది.



బాక్సాఫీస్ వద్ద అగ్నిపరీక్ష.. సామ్ క్రేజ్ తగ్గేదేలే!
టాలీవుడ్‌లో సమంత తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ‘మా ఇంటి బంగారం’ హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇందులో యాక్షన్ సీక్వెన్స్ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సమంత పాత్ర చుట్టూ తిరిగే ఈ ఫ్యామిలీ డ్రామా మే 15న థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: