ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కుంభకోణం రాజకీయ ఆటకు మలుపు తిరిగింది. ములకలచెరువులో ఈ కేసు మొదలైనప్పటికీ, ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు వైరల్ వీడియోలో సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ ఈ కుంభకోణానికి సూత్రధారుడని ఆరోపించారు. వైసీపీ పాలిత దశలో జోగి ఆధ్వర్యంలోనే తయారీ ప్రారంభమైందని, కూటమి ప్రభుత్వం రాకుండా ముందే ఆపేశామని జనార్దన్ రావు వెల్లడించారు.

ఏప్రిల్ నెలలో జోగి ఫోన్ చేసి తయారీ మళ్లీ మొదలుపెట్టమని, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కుంభకోణం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు రూపొందించిన కుట్ర అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.జనార్దన్ రావు వెల్లడి ప్రకారం, తయారీ మొదట ఇబ్రహీంపట్నంలో ప్రజలు జోగి రమేష్ ఆదేశాల మేరకు తంబళ్లపల్లెలో ప్రారంభించాం. చంద్రబాబు నాయుడు స్వస్థలం అయినందున అక్కడ బురద జల్లడం సులభమని జోగి చెప్పారని ఆయన పేర్కొన్నారు.

టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డి, ఇతరులను పార్టీ నుంచి బహిష్కరించడంతో ప్లాన్ మార్చారు. తర్వాత ఇబ్రహీంపట్నం గోదాముల్లో సరకు దాచి, మీడియాకు లీక్ ఇచ్చి రైడ్ చేయించారు. సాక్షి వంటి ఛానెళ్లను ముందుగానే అక్కడ ఏర్పాటు చేశారని జనార్దన్ ఆరోపించారు. పథకం ప్రకారం చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని జోగి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్యలు వైసీపీ రాజకీయ ప్రతీకార కోసం రూపొందినవని జనార్దన్ రావు బయటపెట్టారు.

 పోలీసులు ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.జోగి రమేష్ తన మనుషులతో జనార్దన్ రావును ఆఫ్రికాలోని మిత్రుడి వద్దకు పంపి, బాధ్యతలు తప్పించుకున్నారని నిందితుడు చెప్పారు. అంతా చూసుకుంటా, బెయిల్ పిస్తా అని హ్యాండ్ ఇచ్చినా, మోసం చేశారని ఆరోపించారు. తమ్ముడు జగన్మోహన్ రావును కూడా ఇరికించి, ఈ కుంభకోణంలో భాగం చేశారు. జయచంద్రారెడ్డికి రాబోయే ఎన్నికల్లో సీటు రాదని నమ్మించి, ఈ ప్లాన్‌లో చేర్చారు కానీ అతనికి సంబంధం లేదని జనార్దన్ స్పష్టం చేశారు.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: