ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రధానమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కలతో కలిసి మోదీని కలవనున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి నిధులు పరిశ్రమలు మౌలిక వసతులు వంటి అంశాలతో పాటు తెలంగాణ రైజింగ్ సదస్సుకు ప్రధాని హాజరుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే మైలురాయిగా రేవంత్ భావిస్తున్నారు.ప్రధానిని కలవడానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి భట్టి కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ భేటీ ద్వారా పార్టీ అంతర్గత సమన్వయం కేంద్రంతో సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. రాహుల్ ఆశీస్సులు తీసుకుని మోదీని కలవడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటోంది.ప్రధానితో భేటీ పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క హైదరాబాద్ తిరిగి బయలుదేరనున్నారు. ఈ ఢిల్లీ పర్యటన ఫలితంగా ప్రధాని తెలంగాణ రైజింగ్ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందా అన్నది రాష్ట్రంలో ఉత్కంఠ కలిగిస్తోంది. రేవంత్ ఆత్మీయ ఆహ్వానానికి మోదీ సానుకూల స్పందన ఇస్తారా అన్నదే ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి