ఈ విషయం సామాన్య భక్తుల్లో కూడా ఆగ్రహం రేకెత్తించింది. సోషల్ మీడియాలో జగన్ వ్యాఖ్యలు వ్యతిరేకతకు కారణమయ్యాయి. రాజకీయంగా జగన్ తనకు తానే గొయ్యి తవ్వుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దొంగతనం జరిగిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని టీడీపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఆ కాలంలో దేవస్థానం యాజమాన్యం పూర్తిగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేతుల్లో ఉందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే పార్టీ అధినేత చిన్న దొంగతనం అని తక్కువ చేసి మాట్లాడటం భక్తుల భావాలకు ద్రోహం చేసినట్టు అని విమర్శలు జోరుగా సాగుతున్నాయి.
ఈ వివాదం రోజురోజుకు పెద్దదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాలు కూడా జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా దొంగతనం చేసిన వ్యక్తి స్వయంగా వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో తాను చేసిన పని మహాపాపమని ఒప్పుకున్నాడు. భగవంతుడి ఆస్తి తాకినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగతనం చేసిన వ్యక్తి కూడా తన తప్పును ఒప్పుకుంటే జగన్ మాత్రం చిన్న విషయంగా చెప్పడం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో జగన్‌కు మరింత ఇరకాటంలో పడేసిందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
9490520108.. వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి