ప్రస్తుతం 2021 వ సంవత్సరం విద్యార్థులను పరుగులు పెట్టిస్తుంది. గత ఏడాది అద్దంతరంగా ఆగిన పరీక్షలు, ఉద్యోగాలను ఈ ఏడాది మొదటి నుంచి నిర్వహిస్తున్నారు. కాగా, ఇప్పుడు మరో పరీక్షలను నిర్వహించడానికి నోటిఫికేషన్ ను ఏపి సర్కార్ విడుదల చేసింది. ఏపి లో ఎంసెట్ పరీక్షల నిర్వహణ తేదీని ఖరారు చేస్తూ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ఎంసెట్ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్ నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్ పరీక్షను నిర్వహిస్తారు.