ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెందింది. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం అత‌లాకుత‌లం అవుతున్నాయి. ఈ ప్రాణాంత‌క‌ర క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ కొన‌సాగుతున్నా.. ప‌రిస్థితి అదుపులోకి రావ‌డం లేదు. అయితే ఈ లాక్‌డౌన్ కార‌ణంగా ఎంద‌రో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున ప‌డుతున్నారు.

 

అయితే ఇలాంటి టైమ్‌లో  ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 83 పోస్టులను ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి 2020 మే 10 చివ‌రి తేది. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఇక పోస్టును బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మ‌రియు అభ్యర్థుల గరిష్ట వయస్సు 56 ఏళ్లు ఉండాలి.

 

అలాగే ఈ నోటిఫికేషన్ బ‌ట్టీ 83 పోస్టులు ఉండ‌గా.. అందులో అడ్వైజర్- 1, డైరెక్టర్- 7, జాయింట్ డైరెక్టర్- 2, డిప్యూటీ డైరెక్టర్- 2, అసిస్టెంట్ డైరెక్టర్- 10, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్- 20, అసిస్టెంట్- 8, సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ- 4, పర్సనల్ సెక్రెటరీ- 15, సీనియర్ మేనేజర్- 2, మేనేజర్- 4, డిప్యూటీ మేనేజర్- 8 పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలను https://fssai.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మంచి ఛాన్స్ అస్స‌ల మిస్ కాకండి. నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: