పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పైకి కదిలింది. దీంతో రేటు రూ.46,970కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.360 పెరుగుదలతో రూ.43,050కు ఎగసింది. నిన్నటి రేటుతో పోలిస్తే ఈ రోజుకు ధర పెరిగి షాక్ ఇస్తుంది. వెండి ధరలు కూడా బంగారం ధర దారిలోనే నడిచింది. వెండి ధర ఏకంగా వెండి ధర కేజీకి రూ.800 దూసుకెళ్లింది. దీంతో రేటు రూ.73,300కు చేరింది.