బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే... దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధర ఒక్కసారిగా తారాస్థాయికి చేరిపోయింది. ఇలా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. 

 

గత సంవత్సరంలో తులం బంగారం 31 వెయ్యి ఉంటే వామ్మో అనేవాళ్ళు.. అలాంటిది ఇప్పుడు బంగారం ధర ఏకంగా 45 వేలకు చేరింది.. బంగారం ధరలు ఎదో ఒక రీజన్ తో పెరగడం తప్ప తగ్గడం లేదు.. ఇప్పుడు అయితే సామాన్యులు ఎవరు కూడా ఈ బంగారాన్ని కొనలేరు.. ఆ రేంజ్ లో ఉంది బంగారం ధర! 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 660 రూపాయిల పెరుగుదలతో 48,530 రూపాయలకు చేరింది. ఇంకా అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 620 రూపాయిల పెరుగుదలతో 45,460 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు కూడా అలానే పెరిగాయ్. కేజీ వెండి ధర 1,450 రూపాయిల పెరుగుదలతో 46,700 రూపాయలకు చేరింది. ఇలా బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.. ఈ బంగారం ధరలు సామాన్యులు అందనంత ఎత్తుకి ఎదిగిపోయాయి.                                                                        

మరింత సమాచారం తెలుసుకోండి: