వేసవిలో ఎండలు ఎలా మండి పోతున్నాయో బంగారం ధరలు కూడా రోజుకు రోజుకు అలానే పెరిగి పోతున్నాయి. బంగారాన్ని కొనాలనుకునే సామాన్య ప్రజలకు మాత్రం గుండె గుబెల్ అంటుంది. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి..నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలకు రెక్కలు వచ్చాయి. ఈరోజు బంగారం కొనాలని భావించె మహిలలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. దాంతో ఈరోజు మార్కెట్ లో నగలు కొనేవాల్లు తక్కువ అయ్యారు. ఇకపోతే బంగారం ధరలు పెరిగితే..ఇక వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. ఈరోజు మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని అంటూతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వెలవెలబోయింది. వెండి కూడా అలానే భారీగా కిందకు దిగి వచ్చింది..


ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధరలు ఇలా దూసుకుపోతున్నాయో ఒకసారి చూద్దము..శనివారం బంగారం ధర మార్కెట్ లో భారీగా పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 దూసుకుపోయింది. ఇప్పుడు బంగారం రేటు రూ. 52,590 వద్ద వుంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే విధంగా నమోదు అవుతుంది. పసిడి రేటు రూ.250 పెరుగుదలతో రూ. 48,200 నమోదు అవుతుంది. బంగారం కొద్ది రోజులగా రూ.900కు పైగా పెరిగింది. బంగారం ధరలు దూసుకుపోతే.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. మార్కెట్ లో రూ.1000 పరుగులు పెట్టింది. దీంతో సిల్వర్ రేటు రూ. 73,800కు చేరింది. వెండి రెండు రోజుల్లో రూ.1900 పైకి కదిలింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు..


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గితే.. ఇండియా లో ధరలు భారీగా పెరగడం గమనార్హం..ఔన్స్‌కు 0.23 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1957 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 25.73 డాలర్లకు పడిపొయాయి. బంగారం ధరల పై అనేక పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతో బంగారం ధరలు మార్కెట్ లో రోజుకో విధంగా మారుతున్నాయి..మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా  ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: