మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఈరోజు బంగారం ధరలు భారీగా కిందకు దిగి వచ్చింది.. నిన్న ధరల తో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు కిందకు దిగి వచ్చాయి.ఒకవైపు మార్కెట్ లో బంగారం కొనుగొల్లు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే.తెలుగు రాష్ట్రాల్లో పెండ్లిళ్ల సీజన్‌ కొనసాగుతోంది. ఒక్క మే నెలలో నే వేలాది జంటలు ఒక్కటి కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్ లో బంగారం ధర, వెండి ధరలు కిందకు రావడంతో మార్కెట్ లో ఆదివారం కూడా షాపులు ఖాళీగా లేవు.


అంతర్జాతీయంగా బంగారానికి అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో.. దేశీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం కూడా బంగారం ధర స్వల్పం గా తగ్గింది. గడిచిన వారం రోజుల్లో బంగారం రూ. వెయ్యి వరకు తగ్గింది. మరోవైపు వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ల లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,250 గా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450 కు పడిపోయింది. అయితే గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.


ఆదివారం మార్కెట్ ధరలు కేజీ వెండి 63,700 కు చేరింది. రూ. 300 పెరిగింది. అలాగే మిగిలిన ప్రముఖ నగరాల్లో కూడా ధరలు నమోదు అవుతున్నాయి..10 గ్రాముల బంగారం ధర రూ. 47,500గా ఉంది. అయితే ప్రస్తుతం రూ. 46,250కి పడిపోయింది. వారంలో రూ. వెయ్యి తగ్గింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం వారం ప్రారంభంలో రూ. 51, 810 పలికింది. తాజాగా రూ. 50,450కి తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త పెరిగినట్లు తెలుస్తున్నాయి.. మార్కెట్ లో రేపు బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: