బంగారం కొనాలి అంటే మహిళలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న ధరలు చూసి సామాన్యులు కూడా బగ్గుమనేలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా గోల్డ్మాన్ స్నాక్స్ లాంటివారు తాజాగా నివేదికను తెలియజేశారు. ఇప్పుడు ఏ ప్రపంచ యుద్ధాలు లేవు, కరోనా కూడా లేవు ఆ టైంలో కచ్చితంగా బంగారం తగ్గాలి.. కానీ ఒక్కసారిగా బంగారం పెంచాలనే నిర్ణయం మాత్రం వెంట వెంటనే కొనసాగింది. అంతర్జాతీయ పరిణామాలు అడ్డంపెట్టి మరి వీటిని పెంచేస్తూ ఉన్నారు. ఏ పరిణామం ఏంటో అన్నటువంటిది అసలు లెక్క తేల్చలేదు కానీ.. బంగారం ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి.


ఈ ఏడాది ఇప్పటికే 97,000 వద్ద బంగారం ఉన్నది.. లక్ష రూపాయల వరకు బంగారం వెళుతుందని గోల్డ్ స్నాక్స్ తెలియజేస్తున్నారు. ఈ ఏడాది ఎండింగ్ కి లక్ష పాతికవేల రూపాయల వరకు వెళుతుందట. ఇంకా వీలుంటే 1,50,000 వరకు వెళుతుంది కానీ తగ్గేది ఉండదు అంటూ తెలియజేస్తున్నారు.. ఒకవేళ తగ్గినా కూడా 5000 నుంచి 10000 తప్పించి 50 వేలు లక్ష రూపాయల వరకు అసలు తగ్గదని తెలియజేస్తున్నారు. గతంలో 100రూపాయల నుంచి 10,000 రూపాయలు గ్రామం చేరడానికి 20 ఏళ్ల పట్టింది.


కానీ 1000 నుంచి 10,000 రూపాయలకు చేరడానికి 28 ఏళ్లు పట్టింది. 50వేల నుంచి 90000 కి పెరగడానికి కేవలం నాలుగేళ్లు సమయమే పట్టింది. ఇప్పుడు 90 వేల నుంచి లక్ష రూపాయలకు పెరగడం కేవలం రెండు నెలలలోనే మారిపోయింది. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎటువంటి రోజులలో బంగారం అనేది కూడా నిజంగానే బంగారంగా మారుతుంది. అది ఉండడం కూడా ఒక అదృష్టంగా మారుతుందని స్టేజ్ కి వచ్చేలా కనిపిస్తోంది. అయితే చాలామంది కూడా బంగారం ధరలు పెరిగిపోతాయని పెద్ద మొత్తంలో కొంటూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో సామాన్యులు సైతం బంగారాన్ని కొనలేరని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: