బీ అలర్ట్...ఇంట్లో ఉన్నా కరోనా సోకుతుంది.
కోవిడ్-19.. ప్రపంచాన్ని కలవర పెడుతున్న వైరస్. దీనిపై నిత్యం పరిశోదనలు జరుగుతున్నాయి. వైద్యరంగ శాస్త్రవేత్తలు  తమ పరిశోధన పత్రాలను ఎప్పటి కప్పుడు ప్రపంచానికి  వెల్లడిస్తున్నారు. తాజా విషయాలను అందిపుచుకుని ఎందరెందలో  తమ మేధస్సుకు పదను పెడుతున్నారు. అయితే ఇవవ్నీ కూడా ఒక కొలిక్కి రాకపోవడం సామాన్యుడిని ఆందోళనలో పడేస్తోంది.  వైద్య రంగ పరిశోధకులు మాత్రం  తమ పనిని నిరంతరం చేస్తున్నారు.

బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల  కరోనా వ్యాప్తి పై అధ్యయనం చేశారు. ఆ వివరాల ప్రకారం కరోనా తాజా రూపం డెల్టా వేరియంట్ వ్యాప్తి ఉధృతంగా ఉండనుంది. ఈ వైరస్ ఇళ్లలో ఉన్న వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని వారు ప్రకటించారు. కళ్లలో నుంచి కళ్ల లోకి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అయితే ఇళ్లలో ఉండే వారికి డెల్టా వైరస్ సోకిన వివరాలు అంతగా అందుబాటు లో లేక పోవడంతో తమ పరిశోధనలు సజావుగా సాగలేదని కూడా శాస్త్ర పరిశోధకులు ప్రకటించారు.
కోవిడ్ టీకా పొందిన వారికి కూడా ఈ వైరస్ సోకో అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే వైరస్ జీవన కాలం చాలా తక్కువని పేర్కోన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఈ వైరస్ బారి నుంచి త్వరగా బైట పడవచ్చని చెప్పారు. అంతే కాక, ఒకరికే రెండు మూడు సార్లు ఈ వైరస్ సోకే అవకాశం ఉందని  హెచ్చరించారు. భారత్ లో ఎక్కువ మంది, ఎక్కువ సేపు ఇళ్లలోనే ఉంటారని, అందు వల్ల   ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారి నుంచి తప్పించు కోవచ్చని సూచించారు. ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలు బట్టి కోవిడ్ - 19 నుంచి తప్పించు కోవడానికి టీకా ఒక్కటే శర ణ్యంగా కనిపిస్తున్న దన్నారు. అయితే ఇళ్లలో వ్యాప్తి చెందే డెల్టా వేరియంట్ కు సంబంధించి ప్రభుత్వాలు తగిన వివరాలను అందుబాటులోకి తీసుకురావాలని, అప్పుడే శాస్త్ర పరిశోధనలకు మరింత అవకాశంకలుగుతుందని చెప్పారు. కోవిడ్ -19 టీకా వేసుకున్న వారు కూడా ఇళ్లలో మగ్గుతూ ఉంటే డెల్టా వేరియంటా బారిన పడక తప్పదని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: