కరోనా కష్టకాలం... గడచిన రెండు సంవత్సరాలకు పై బడిన కాలమంతా  ప్రపచంలో ఎక్కువ ఆందోళన చెెందన వారెవరైనా ఉన్నారా ? అంటే ఖచ్చితంగా  ఆ వరుసలో ముందుగా పేర్కోనదగిన వారు ఆస్తమా వ్యాధిగ్రస్తులు.  వారు  ప్రస్తుతం గతంలో మాదిరిగా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్విన్ బర్న్ విశ్వ విద్యాలయం వైద్య శాస్త్రవేత్తలు పరిశోదనలు ఈ విధంగా ఉన్నాయి...
ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాడే మందులు, వారిని  కరోనా మహమ్మారి ముప్పునకు దూరంగా ఉంచుతాయని,  స్విన్ బర్న్ విశ్వవిద్యాలయం  రీసెర్చ్ స్కాలర్స్ పరిశోధలో తెలింది. ఈ విషయాన్ని వారు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు తెలిపారు.
ఆస్తమా వ్యాధిగ్రస్తులు రసాయన కాలుష్యం బారిన పడుతుంటారు. అంతేకాక వీరికి దుమ్మ, ధూళి, పొగ,  వాహనాలు వెదజల్లే కాలుష్యం కూడా వీరిపై ప్రభావం చూపుతుంది. దీంతో వీరి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారు. కోవిడ్-19 సోకితే ప్రాణాపాయం ఎక్కువని కూడా ఈ వ్యాధిగ్రస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారు. దీంతో వీరు మానసికంగా కూడా కృంగి పోతుంటారు. ఈ వ్యాధిగ్రస్తులకు  స్విన్ బర్న్ విశ్వవిద్యాలయం పరిశోధనలు వీరికి ఖచ్చితంగా ఒక వరం లాంటిదే. ఆస్త్మా వ్యాధిగ్రస్తులు తమ వ్యాధిని అదుపులో పెట్టుకునేందుకు, నియంత్రించుకునేందుకు స్టిరాయిడ్ల పై ఆధారపడుతారు. వీరు ఎక్కువగా కార్డికో - స్టెరాయిడ్లు పై ఆధారపడతారని వైద్య శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. దీనికి తోడు వైద్యులు ఈ వ్యాధిగ్రస్తులకు స్టెరాయిడ్లు అందజేస్తున్నారు. కరోనా బాధితులకు కూడా  ఊపిరితిత్తులలో ఏ సమస్య ఉండకుండా ఉండేదుకు, ఇప్పటికే ఉన్న సమస్యలను రూపుమాపేందుకు స్టెరాయిడ్లు ఇవ్వడం జరుగుతోంది. ఈ స్టెరాయిడ్లు  ఆస్తమా వ్యాధిగ్రస్తులలో సత్ఫలితాలను ఇచ్చాయని  వైద్యరంగ పరిశోధకులు పేర్కోన్నారు.
అంతే కాకుండా కోవిడ్-19 ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కొందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా దుమ్ము, ధూళికి దూరంగా గడిపారు.  దీంతో వారిలో రోగనిరోధక శక్తి పెరిగింది. ఈ కారణంగా కూడా ఆస్తమా వ్యాధిగ్రుస్తులు కవిడ్-19 కు చెందిన ఏ వైరియంట్ల ను చూసి భయపడాల్సిన అవసంర లేదు. కాక పోతే గతంలో మాదిరి గానే జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.


మరింత సమాచారం తెలుసుకోండి: