ఇటీవల కాలంలో చాలా మంది ఒకే చోట కూర్చోవడం.. లేదా ఒకేచోట నిలబడటం వంటి పనులు చేసినప్పుడు కండరాలు అలాగే కాలి పిక్కలు పట్టేసి ఉన్నట్టు కనిపించడం.. అప్పుడప్పుడు ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇకపోతే మోకాలు దిగువభాగంలో కాళ్లకు వెనుక వైపు ఉండే బలమైన కండరాలను మన కాలి పిక్కలు అని పిలుస్తాము.. ఇక పోతే ఈ సమస్య చాలా మందిలో రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ పిక్కలు పట్టేయడంతో విపరీతమైన నొప్పి పైగా బాధను భరించలేక పోతున్నారు.. ఈ నొప్పి రావడానికి గల కారణాలు ఏమిటి అనే విషయానికి వస్తే ఎక్కువ సేపు నడవడం.. నిలబడ్డం.. ఒకేచోట కదలకుండా కూర్చోవడం.. నరాల మీద ఒత్తిడి .. రక్తనాళాల్లో అవరోధాలు.. రక్తహీనత వంటి ఎన్నో కారణాలు చెప్పవచ్చు .


ముఖ్యంగా మన శరీరంలో మెగ్నీషియం స్థాయిలు తక్కువ అయినప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.. ఎప్పుడైనా సరే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ ముక్కలను ఒక పలుచటి గుడ్డలో చుట్టి కాపడం పెట్టాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇక రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు కాళ్ళ కింద దిండు పెట్టుకొని కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవడం మంచిది. ప్రతి రోజు ఉదయం కాళ్లను అటూ ఇటూ కదుపుతూ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల ఇలాంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.


మెగ్నీషియం లోపించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే గుమ్మడికాయ విత్తనాలు , పాలకూర, ఆకుకూరలు, పెరుగు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. అనపకాయ, బూడిదగుమ్మడికాయ కూడా  నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇక రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.. ఒకవేళ మీకు రక్తం లేనట్టు అనిపిస్తే వెంటనే రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. మీరు  ఏదైనా సరే వైద్యుల పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: