ఒక వైపు తెలంగాణలో గత నాలుగు రోజుల నుండి వర్షాలు పడుతున్నా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించగా.. మరో వైపు..మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరి అటువంటి టైం లో అవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దు అంటూ ఐఎండీ ప్రజలను హెచ్చరించింది. మరి ఈ సూచనల ప్రకారం గడిచిన రోజులకన్నాఇక నుండి రాబోవు నాలుగు రోజులలో మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేకపోలేదన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అయిన బీఆర్‌ అంబేద్కర్ తెలియజేసారు . మరి ఇటువంటి సమయంలో.. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటూ.. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి వోఆర్‌ఎస్‌ లు , లస్సీ, ఇంట్లో తయారుచేసిన పానీయాలైన నిమ్మకాయ నీరు, లేక మజ్జిగ, కొబ్బరి నీరు ఇలాంటి మొదలైనవి పానీయాలు తాగాలని సూచించారు.

ఇక పొతే వృద్ధులు, అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తమకి అలాగే తమ చిన్న పిల్లలకు ఎండ దెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా  ఈ శనివారం పార్వతీపురం మన్యం 12, , అనకాపల్లి 8, విజయనగరం 9, కాకినాడ 3, అల్లూరి సీతారామరాజు 6 మిగిలిన చోట్ల కూడా అక్కడక్కడ కలిపి మొత్తంగా  41 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపుతున్నాయని... అలాగే ఏప్రిల్ 23 నుండి  26 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం లేకపోలేదని పేర్కొంది.. ఇక ఏప్రిల్ 23న అల్లూరి సీతారామరాజు,  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అలాగే కొన్నిపరిసర ప్రాంతాల్లో 43°C నుండి  44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించారు.

ఇక, 24వ తేదీన, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని పరిసర ప్రాంతాల్లో 45°C నుండి 46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదవ్వనుండగా .. మరోవైపు 25వ తేదీన  అల్లూరి సీతారామరాజు,  విజయనగరం, పార్వతీపురంమన్యం,పల్నాడు, ఏలూరు,  నంద్యాల, వంటి జిల్లాలలోని ప్రాంతాల్లో 45°C నుండి 46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే మరో వైపు.. ఏప్రిల్‌ 26వ తేదీన కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుందని.. దాని ప్రభావం ఎక్కువగా  శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,  అల్లూరి సీతారామరాజు,  ఏలూరు, ఎన్టీఆర్, విజయనగరం, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, ఇలా మొదలగు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల వరకు  43°C నుండి 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని .. మిగిలిన జిల్లాలలోని  కొన్ని ప్రాంతాలలో మాత్రం  ఓ మోస్తరులో తగ్గి  40°C నుండి 42°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఎండలు మరి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: