మనం తీసుకునే ఆహార పదార్థాలు రాత్రిపూట తినడానికి ఆరోగ్యానికి అంత  మంచిది కాదు. మనం తీసుకునే ఆహారం బట్టే మన ఆరోగ్యం బాగుంటుంది.అందుకే ఫుడ్ డైట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి పోషకాహారంతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలకు రాత్రి పూట ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. రాత్రి పూట తీసుకునే కొన్ని పదార్థాలు జీర్ణ క్రియకు చాలా ఇబ్బంది కలిగిస్తాయని, కాబట్టి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెబుతోంది.వరి అన్నం అస్సలు రాత్రి పూట తినకూడదు.దీన్ని కేవలం మధ్యాహ్నం మాత్రమే తినాలి. రాత్రి వేళ వరి అన్నానికి బదులుగా గోధుమ పిండితో చేసిన రొట్టెలను తినడం ఆరోగ్యానికి చాలా మేలు. అలాగే పాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ టైం అవసరం. అందుకని రాత్రి వేళ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా పెరుగును కేవలం పగటి వేళనే తినాలి.రాత్రి సమయంలో తింటే పెరుగు త్వరగా జీర్ణం కాదు.


ఇంకా అలాగే మాంసం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి మధ్యాహ్నమే తినాలి.మసాలా పదార్థాలకు రాత్రి పూట ఖచ్చితంగా దూరంగా ఉండాలి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా రుచికరమైన బిర్యానీని రాత్రి వేళల్లో తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇంకా సాయంత్రం ఏడు గంటల తర్వాత చికెన్ ,మటన్ బిర్యానీలను అస్సలు తినకూడదట. ఎందుకంటే ఇవి ఆరోగ్యాన్ని మరింత పాడు చేస్తాయి. ఇక వీటిలో కొవ్వు క్యాలరీలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి . కాబట్టి ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇంకా అలాగే రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు కూడా అస్సలు తినకూడదు. వేయించిన పదార్థాలు, టీ ఇంకా కాఫీ వంటి పదార్థాలకు చాలా దూరంగా ఉండటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: