ప్రస్తుత రోజులనేవి తినే తిండి కూడా హడావుడిగా తింటోన్న రోజులు. అయితే ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా డేంజర్‌ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తినడానికి సగటున 30 నుంచి 35 నిమిషాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని పూర్తిగా నమలిన తర్వాతే మింగాలని నిపుణులు చెబుతున్నారు.ఎలా పడితే అలా తింటే ఖచ్చితంగా జీర్ణ సంబంధిత జబ్బులు తప్పవని చెబుతున్నారు. ఈ సమస్యకు ఈజీగా చెక్‌ పెట్టడానికి ఈ టిప్స్‌ ఖచ్చితంగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..భోజనాన్ని కనీసం ఖచ్చితంగా 30 నిమిషాలు తినేలా ప్లాన్‌ చేసుకోవాలట. మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి కనీసం 15 నుంచి 30 సార్లు నమలడానికి ప్రయత్నించాలి. ఇలా తినడం వల్ల ఆహారం అనేది చాలా త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ఊబకాయం సమస్య నుంచి కూడా ఈజీగా తప్పించుకోవచ్చు.


జపాన్‌లోని ఒక విశ్వవిద్యాలయ పరిశోధకులు టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న 59,717 మంది నుండి డేటాను కలెక్ట్ చేసి పరిశీలించారు. వేగంగా తినే వారు ఎక్కువగా ఊబకాయం సమస్యతో బాధపడుతున్నట్లు అందులో తేలింది. దీనికి ప్రధాన కారణం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకాకపోవడమేనట.మీరు తొందరపడి ఆహారాన్ని కనుక తీసుకంటే జీర్ణక్రియ రేటు ఖచ్చితంగా తగ్గుతుంది. గుండెల్లో మంట, అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అలాగే డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణం చేసే సమయంలో అస్సలు భోజనం చేయకూడదు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారం తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తీసుకున్న తరువాతనే నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకునే సమయంలో ఇలాంటి టిప్స్‌ పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: