ఈ చలికాలంలో ఆస్తమా రోగులు ఖచ్చితంగా కూడా చల్లని గాలికి దూరంగా ఉండాలి. ఎందుకంటే చల్లని గాలికి ఎక్కవగా ఎక్స్ పోజ్ కావడం వల్ల శ్వాసనాళాలు సంకోచం చెంది అవి మూసుకుపోతాయి. అందువల్ల వారికి ఊపిరి సరిగ్గా ఆడక చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి సమయంలో వారు ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇంకా అలాగే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినప్పుడు బయట ఎక్కువగా వెళ్లకుండా ఎండ సమయంలోనే వారు బయట పనులు చూసుకోవాలి. అర్థరాత్రి ఇంకా తెల్లవారుజాము సమయాల్లో బయటకు వస్తే మీ ముక్కు ఇంకా నోటిని ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. ఇంకా అలాగే మీ డాక్టర్ సిఫార్సు ప్రకారం ఒక ఇన్హేలర్ ని ఎల్లప్పుడూ మీ దగ్గర పెట్టుకోవాలి. మీ డాక్టర్ తెలిపిన విధంగా రెగ్యులర్ ఇన్హేలేషన్ థెరపీ ని తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి పీక్ ఫ్లో మీటర్ కూడా వాడవచ్చు.ఈ పీక్ ఫ్లో మీటర్ ఊపిరి పీల్చుకునేటప్పుడు ఊపిరితిత్తుల నుంచి గాలిని ఎంత వేగంగా నెట్టగలరో ఈజీగా అంచనా వేస్తుంది.


ఇది మీ ఊపిరితిత్తుల బలాన్ని అర్థం చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది.ఇక అలాగే ఉబ్బసం ఉన్న రోగుల్లో చలికాలం వాతావరణం కారణంగా ఆస్తమా ఎక్కువ కావచ్చు. ఈ సమయంలో మీకు ఫ్లూ కనుక వ్యాపిస్తే ఆస్తమా  పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అధిక కాలుష్య స్థాయిలు (అవుట్‌డోర్, ఇండోర్ కాలుష్యం) బయట పొగమంచు వల్ల కూడా ఆస్తమా తీవ్రత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి చలికాలం స్టార్ట్ అవ్వడానికి ముందు వార్షిక ఇన్ ఫ్లూఎంజా టీకాలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకా అలాగే కోమోర్బిడిటీలతో బాధపడుతున్న వృద్ధ రోగులు, అలాగే, ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారు బయటకు వెళ్లే టప్పుడు ఖచ్చితంగా కూడా ముసుగులు ధరించాలి. ముఖ్యంగా వారు చేతి పరిశుభ్రతను పాటించాలి.ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులకు అంటు వ్యాధులు శోకకుండా ఈజీగా కాపాడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: