వెల్లుల్లి.. ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లో ఉండే ఔష‌ధం. కూర‌ల్లో విరివిరిగా ఉప‌యోగించే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది కాస్త ఘాటుగా ఉండ‌డం వ‌ల్ల చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అదే మీరు చేసే పొర‌పాటు. ఆరోగ్యం పెంపొందిచుకోవడానికి వెల్లుల్లి చక్కని పరిష్కారం. ముఖ్యంగా ఈ క‌రోనా టైమ్‌లో వెల్లుల్లిని ఖ‌చ్చితంగా తీసుకోవాలంటున్నారు.  మానవాళి గుండెల్లో గుబులు పుట్టిస్తున్న క‌రోనా నుంచి ర‌క్ష‌ణ పొందాలంటే.. రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఈ విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు నిపుణులు కూడా చెబుతున్నారు.

IHG

మ‌రి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే.. అందుకు త‌గ్గా ఆహారం తీసుకోవాలి. అయితే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచే శ‌క్తి వెల్ల‌ల్లికి పుష్క‌లంగా ఉంది. అవును! వెల్లుల్లిని డైట్‌లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో శ‌రీరం ఎలాంటి ఇన్ఫక్షన్స్‌నైనా ఎదుర్కొంటుంది. ఇక జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబుకు చెక్ పెట్టాలంటే.. వెల్లుల్లిరసం, తేనె క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక  అధిక రక్తపోటుని వివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. 

IHG

ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్‌ సల్ఫేట్‌, నైట్రిక యాసిడ్‌ రక్తనాళాల ఉపశమనానికి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అలాగే గుండె జబ్బు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి కీలక పాత్ర పోషించగలదు. ఇక‌ జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను కూడా శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. ఇక వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూ వుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. కాబ‌ట్టి, వెల్లుల్లిని ప‌రిమితి మించ‌కుండా తీసుకోవ‌డం ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: