ప్రశాంతమైన నిద్ర కోసం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ హెల్త్ ఆర్టికల్ లో చదవండి... మీరు నిద్రపోయే రూమ్ చల్లగా, చీకటిగా ఉండేటట్లు చూసుకోండి. బెడ్రూమ్ విండోస్ కి హెవీ కర్టెన్స్ యూజ్ చేయండి. డిమ్ నైట్‌లైట్ ని హాల్ లో కానీ, బాత్రూమ్ ముందు కానీ యూజ్ చేస్తే రాత్రి పూట లేచినా ఇబ్బంది ఉండదు.ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ వలన బరువు తగ్గడం, ఆరోగ్యానికి మంచిది లాంటి బెనిఫిట్స్ తో పాటూ మంచి నిద్ర కూడా ఎక్సర్సైజ్ వలన సాధ్యపడుతుంది.సూర్యాస్తమయం నుండీ కెఫీన్, నికోటిన్ తగ్గించండి. ఇవి స్టిమ్యులేట్ చేస్తాయి, ఫలితంగా నిద్ర పట్టదు.

రాత్రి హెవీగా తినకండి, లేదా తిన్న తరువాత రెండు గంటల వరకూ నిద్రపోకండి.రిఫైండ్ కార్బ్స్, షుగరీ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ నిద్ర ని డిస్టర్బ్ చేస్తాయి.బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చుని వర్క్ చేసుకోవడం వంటి పనుల వల్ల బ్రెయిన్ బెడ్ ని నిద్ర కి ఎసోసియేట్ చేయలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ వలన మీరు బెడ్రూమ్ లోనే పని చేసుకోవలసి వస్తే బెడ్ మీద కూర్చుని కాకుండా పక్కన ఇంకో అరేంజ్మెంట్ చేసుకోండి.


రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి ఒకే సమయానికి లేచే అలవాటు చేసుకోండి. వీకెండ్స్ అయినా సరే, ఈ టైమింగ్స్ మాత్రం మార్చకండి. అలాగే, సూర్యోదయానికి ఎంత దగ్గరగా నిద్ర లేస్తే అంత మంచిది.వీలున్నంత వరకూ పగలు కునుకు తీయకండి. తప్పదనిపిస్తే ఒక్క పావుగంట మించి నిద్రపోకండి.మీరు నిద్ర పోయే సమయం కంటే ముందే మీకు మత్తుగా అనిపిస్తే వెంటనే పడుకోకండి, మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఫ్రెండ్ కి కాల్ చేయడమో, మరుసటి రోజుకి కావాల్సిన బట్టలు తయారుగా పెట్టుకోవడమో వంటి పనులు చేయండి.

పగలు సన్‌లైట్ కి ఎక్స్పోజ్ అవ్వండి. బాల్కనీలో కూర్చుని కాఫీ తాగండి. బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు మీ డైనింగ్ రూమ్ విండో ఓపెన్ చేసేయండి. వర్క్ లో బ్రేక్స్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా బయటకి రండి.

మరింత సమాచారం తెలుసుకోండి: