టొమాటోసాస్ అనగానే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా?సాధారణంగా టొమాటో లో ఎక్కువగా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. అవి మన శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. టొమాటోను ఎక్కువగా ఫేస్ ప్యాక్ కి కూడా ఉపయోగిస్తారు. ముఖం మీద మొటిమలు తో పాటు ఎన్నో మచ్చలు కూడా తగ్గించి, ప్రకాశవంతంగా తయారు చేస్తుంది. టొమాటో లో ఎక్కువగా విటమిన్ ఎ, విటమిన్ సి లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయని మనందరికీ తెలుసు.
అయితే ప్రస్తుతం టొమాటొ లతో తయారు చేసే టొమాటో సాస్ కూడా ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టాం. అయితే ఇది మన ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా? ఇప్పుడు ప్రతి ఒక్కరు లో సందేహం కలగవచ్చు. టొమాటో లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి, ఇప్పుడు టొమాటో సాస్ తింటే అనారోగ్యం పాలవుతారు అని అంటున్నారు. వినే వారు ఉంటే ఏదైనా చెప్తారు కదా! అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.
ఇది అక్షర సత్యం టొమాటో సాస్ ను ఎక్కువగా తినడం వల్ల అనారోగ్యం పాలవుతారు అని నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే టొమాటో లో ఉన్న పోషకాలు టొమాటోసాస్ లో లేవట. టొమాటో సాస్ ని తయారు చేసేటప్పుడు కేవలం టొమాటోలను మాత్రమే కాక ఉప్పు, కారం,వెల్లుల్లి,ఉల్లిపాయ వంటివి కలుపుతారు. అంతేకాకుండా సాస్ కి తగ్గ రుచి, రంగు రావడం కోసం వీటిలో ఫుడ్ కలర్స్ తో పాటు ఎన్నో రసాయనాలను వాడుతున్నారు.
అంతేకాకుండా టొమాటోలు ఎక్కువ ధర ఉన్నప్పుడు, టొమాటో లకు బదులుగా పుచ్చకాయ, బొప్పాయి పండ్ల పిప్పిని కూడా కలుపుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు తమ లాభార్జన కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.ఇలాంటి వాటి వల్ల షుగరు, బీపీ, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారు ఇంకా అనారోగ్య పాలవుతున్నారు. ఆరోగ్యవంతులకు కూడా అనారోగ్యాలుగా మారుతున్నారు.సాస్ లో ముఖ్యంగా హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ను ఎక్కువగా వాడుతుంటారు. వీటి వాడకం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
టొమాటోలను టొమాటో సాస్ గా మార్చడం వల్ల అందులో ఉండే విటమిన్స్, ఫైబర్స్ నశించిపోతాయి. సాస్ ను ఎక్కువగా తినడం వల్ల అలర్జీ, డయాబెటిస్, బీపీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అధికమవుతాయి. అయితే టొమాటో సాస్ ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకొని తినడం ఉత్తమం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి