పనస పండు చూడటానికి చాలా కరకుగా, కట్ చేయడానికి ఇబ్బందిగా ఉన్నా, దీని రుచి చూడగానే ఎవరైనా ఫిదా కావాల్సిందే. పనస పండు మధురంగా ఉండటమే కాకుండా మనకు కావలసిన అన్ని పోషకవిలువలు ఇందులో ఉంటాయి . అయితే పనసపండుని తిని చాలా మంది పనసవిత్తనాలని  పారేస్తారు. అది పొరపాటు ఎందుకంటే పనస విత్తనాల లో మన ఆరోగ్యాన్ని కాపాడే చాలా గుణాలు ఇమిడి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం !
 
పనసకాయ విత్తనాలు అధిక నాణ్యత గల ప్రోటీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి కండరాలను నిర్మించడంలో ను, వాటిని బలోపేతం చేయడంలోనూ సహాయపడతాయి.

పనసకాయ విత్తనాలలో యాంటీమైక్రోబయల్ గుణాలు అధికంగా ఉంటాయి. కనుక యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి .

పనసకాయ విత్తనాలు విటమిన్ ఎ, డి, కలిగి ఉన్నందున.వీటిని ఆహారంగా తీసుకుంటే కంటి సంబంధిత వ్యాధులు తొలగుతాయి , కంటి చూపు మెరుగుపడుతుంది.

పనసకాయ విత్తనాలలో థయామిన్ , రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది మనం తీసుకునే ఆహారాన్ని సమర్థవంతంగా శరీరానికి అందించడంలో తోడ్పడతాయి.

పనసకాయ విత్తనాలను చల్లటి పాలతో కలిపి పేస్ట్ గా చేసిన తర్వాత ముఖానికి మర్దనా చేసుకుంటే మచ్చలు , ముడతలు తొలగి సౌందర్యవంతంగా కనిపిస్తారు.

పనస విత్తనాల లో హిమోగ్లోబిన్ సమృద్ధిగా లభిస్తుంది వీరిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో రక్తం అభివృద్ధి చెంది రక్తహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

మనం వృధాగా పడేసే పనస విత్తనాల్లో ఇంకా ఎన్నో పోషక విలువలు దాగున్నాయి. కాబట్టి వాటిని ఆహారంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
                                                                                                                                                                                                                                                                                       

మరింత సమాచారం తెలుసుకోండి: