ఉరుకుల పరుగుల జీవితం.. ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలనే ఆశ.. దానికి తోడు అధునాతన జీవనశైలి.. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారపు అలవాట్లు.. వెరసి ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధాప్యం వచ్చిన తరువాత కూడా ఎంతో దృఢంగా  కనిపించే వారు కానీ నేటి రోజుల్లో యువకులు సైతం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ శారీరక దారుఢ్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  అయితే నేటి రోజుల్లో ఒకే చోట గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా స్థూలకాయులు గానే మారిపోతున్నారు.



 అంతేకాదు ఇక ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న ఎంతోమంది ఈ ఒత్తిడిని పోగొట్టుకోవడానికి కనీసం ఏ ప్రయత్నం చేయడం లేదు. ముఖ్యంగా ప్రతి రోజూ వ్యాయామం చేయాలి అనే నిపుణులు సూచిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. వ్యాయామం  చేయడం వల్ల ప్రతిరోజూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి రోజూ ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించడం ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు.  ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు అంటూ సూచిస్తుంటారు నిపుణులు. కానీ ఎవ్వరికీ వ్యాయామం  చేసే అంత సమయం లేదు. ఒకవేళ సమయం ఉన్నా ఎవరు కూడా ఆసక్తి కనబరచడం లేదు.



 అయితే వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వ్యాయామం చేయకపోతే జరిగే అనర్ధాలు ఏంటి అనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ఇప్పుడు అవి ఏంటో తెలుసుకుందాం.. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి అంటూ నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయట. దీంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కండరాలు బలహీనపడి చురుకుదనం కూడా తగ్గిపోతుందని అంటున్నారు. ఫిజికల్ యాక్టివిటీ కి దూరంగా ఉంటే బరువు పెరిగి కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట. అంతేకాదు ఫిజికల్ యాక్టివిటీ కి దూరంగా ఉన్నవారు  త్వరగా నిద్రపోలేరు అని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: