ఒకే భంగిమలో నిరంతరం కూర్చోవడం వల్ల మన చేతులు, కాళ్లు అన్నీ మొద్దుబారడం చాలా సార్లు జరుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదిలే ఉంటుంది. శరీరంలోని కొన్ని భాగాలలో తిమ్మిరి సాధారణమైనప్పటికీ, శరీరంలో ఏదైనా లోపం లేదా వ్యాధి కారణంగా కూడా ఇలా జరగొచ్చు. మనం ఒకే స్థితిలో కూర్చోవడం తరచుగా జరుగుతుంది. దీని కారణంగా తిమ్మిరి వస్తుంది. అలాంటప్పుడు తిమ్మిరి ఎక్కిన భాగాన్ని పట్టుకుని కదుపుతాము. తద్వారా అది దాని సాధారణ స్థితికి తిరిగి వస్తుంది. చాలా సార్లు తిమ్మిరి కారణంగా చేతులు మరియు కాళ్ళలో ఒక విచిత్రమైన జలదరింపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మన అవయవాలు ఎందుకు మొద్దుబారిపోతున్నాయి ? వెంటనే ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.

శరీర భాగాలు ఎందుకు మొద్దుబారిపోతాయి?
మనం తరచుగా చేతులు, భుజాలు, కాళ్ళలో తిమ్మిరి అనుభూతి చెందుతాము. దీనికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చున్నప్పుడు ఈ అవయవాలు చాలా ఒత్తిడికి గురవుతాయి. ఒకే విధంగా కూర్చోవడం వల్ల శరీరంలోని కండరాలు, రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఆ శరీర భాగం తిమ్మిరి స్థితికి వెళుతుంది. సాధారణంగా శరీరంలో రక్తప్రసరణలో అడ్డంకులు ఏర్పడినప్పుడు శరీర భాగం మొద్దుబారిపోతుంది.

తిమ్మిరి యొక్క లక్షణాలు ఏమిటి
శరీరంలో తిమ్మిరి వచ్చినప్పుడు జలదరింపు, ఒక వింత అనుభూతి వస్తుంది. ఆ అవయవం కూడా పనిచేయడం మానేస్తుంది. దీనివల్ల చాలాసార్లు ఈ అవయవానికి మానసిక సంకేతాలు కూడా అందవు. అటువంటి పరిస్థితిలో ఆ అవయవాన్ని సాధారణ స్థితిలోకి తీసుకురావడానికి ఒక దెబ్బ వేయాలి.

వెల్లుల్లి లేదా పొడి అల్లం
అవయవాలలో తిమ్మిరిగా అనిపిస్తే ఉదయాన్నే ఫ్రెష్ అయిన తర్వాత చిన్న చిన్న అల్లం ముక్కలు లేదా 2 వెల్లుల్లి రెబ్బలను నమిలి తినండి. దీంతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. నిజానికి వెల్లుల్లి, ఎండు అల్లం తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

రావి ఆకులు
రావి చెట్టు ఆకులలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు తిమ్మిరి అనిపిస్తే 3-4 తాజా ఆకులను ఆవనూనెలో బాగా ఉడికించి, ఆపై ఈ నూనెతో తిమ్మిరి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు తిమ్మిరి నుండి ఉపశమనం పొందుతారు.

నెయ్యి
ప్రతిరోజూ పాదాలలో తిమ్మిరి సమస్యతో పోరాడుతుంటే భయపడవద్దు. నెయ్యితో చిటికెలో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. తిమ్మిరి నుండి ఉపశమనం పొందడానికి రాత్రి పడుకునే ముందు నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా చేసి అరికాళ్ళకు రాయండి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: