కొబ్బరికాయను అందరు పవిత్రంగా భావిస్తారు. మంచి పనులను చేయడానికి కొబ్బరికాయలు కొట్టడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. కొబ్బరి నీటిని తాగడానికి వినియోగిస్తే, కొబ్బరిని ఆహారాల్లో వినియోగిస్తుంటారు. కొబ్బరి నుండి తీసే నూనె సైతం వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే కొబ్బరి ఆరోగ్యప్రదాయిని. కొబ్బరి నూనెలో వైరల్, ఫంగల్, బ్యాక్టీరియా వ్యాధికారకతను తగ్గించడంలో తోడ్పడుతుంది. కొబ్బరి లో ప్రతి భాగం ఉపయోగకరమైనదే. కొబ్బరిలో కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉంటాయి. కొవ్వు సైతం తక్కువే. పొటాషియం అధికంగా ఉండగా, చక్కెర తక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడే పిల్లలకు కొబ్బరి నూనె బాగా ఉపకరిస్తుంది.అతిసారం వచ్చిన సందర్భంలో రీహైడ్రేషన్ గా ఉపయోగిస్తారు.

ఇందులో ఉండే పొటాషియం గుండె సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు,కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి ఔషధంగా పనిచేస్తుంది. రోజు వారి పనిలో ఒత్తిడి,టెన్షన్ వంటివి  పోవాలంటే రోజూ కొద్ది మోతాదులో కొబ్బరి పాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో పోషకాలను పెంపొందించడంలో కొబ్బరి బాగా ఉపకరిస్తుంది. కొబ్బరిని కాస్త బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల ఐరన్ పెరగడంతోపాటు వారికి మంచి శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎముకల పటుత్వం పెరిగి, కీళ్ళ సంబంధిత నొప్పులు తగ్గుతాయి. కడుపులో మంట,అజీర్ణం, త్రేన్పులు రావడం ఇలాంటి సమస్యలు ఉన్న వారంతా లేత కొబ్బరి తినడం వల్ల వాటిని దూరం చేసుకోవ చ్చు. ఇక లేత కొబ్బరి లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది.

 బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్ లో లేత కొబ్బరిని చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ ను వృద్ధి చేయడంలో పచ్చికొబ్బరి దోహదపడుతుంది. లైంగిక సమస్యలతో బాధపడే వారికి బాగా ఉపకరిస్తుంది. కొబ్బరి లో విటమిన్ ఏ,బి,సి, థయామిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము పుష్కలంగా దొరుకుతాయి. కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ వంటి సమస్యలు తొలగిపోతాయి. వ్యాధినిరోధక శక్తి పొందాలంటే కొబ్బరిని రోజు వారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: