ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది కూడా అధిక బరువుతో బాధపడుతున్నారు. దీంతో బరువు(weight) తగ్గించుకునేందుకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. సరైన వ్యాయామం చేయడంతో పాటు ఓ చెట్టు ఆకులు తింటే చాలా ఈజీగా బరువు తగ్గొచట..ఇక ఆ ఆకులు ఏవో కాదు అవే జామ ఆకులు(guava leave). జామపండులో ఎన్నో రకాల పోషక విలువలుంటాయి. ఇది శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా చేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ లకు చాలా మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇది జీర్ణక్రియ ఇంకా అలాగే ఇతర సమస్యలను తొలగించడానికి బాగా దోహదపడుతుంది. జామ పండే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా రకాల మేలు చేస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. జామ ఆకులను తీనడం ద్వారా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జామ ఆకుల్లో చాలా రకాల ఔషధ(Medicine) గుణాలు కూడా ఉన్నాయి. ఇవి మీ శరీరానికి చాలా మేలు చేస్తాయి.శరీరంలో కాంప్లెక్స్ స్టార్చ్ చక్కెరగా మారి బరువు పెరగడం కూడా ప్రారంభమవుతుంది.ఈ జామ ఆకులు బరువు తగ్గడానికి తోడ్పడతాయని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే ఈ ఆకులలో కార్బోహైడ్రేట్లను తగ్గించే శక్తి ఉండడం వల్ల వీటిని తింటే ఊబకాయం శాశ్వతంగా దూరమవుతుందట.



జామ ఆకులు అతిసారం వ్యాధి సమస్యతో బాధపడుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకులను గ్లాసు నీటిలో వేసి మరిగించి రోజుకు రెండుసార్లు తాగితే పొట్ట ఈజీగా తగ్గుతుంది. ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. దీనిని తగ్గించడానికి జామ ఆకుల టీ తాగడం చాలా మంచిదంటున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.జామ ఆకులతో తయారు చేసిన టీని తాగడం ద్వారా శరీరంలో ఆల్ఫా-గ్లూకోసిడేస్ ఎంజైమ్ చర్యను తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా.. వీటిని మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు బాగా సిల్కీగా కూడా అవుతుంది.కాబట్టి ఈ జామ ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మంచి ప్రయోజనం అనేది మీకు కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: