మన చాలా మందికి కూడా చపాతి, పరోట, రుమాలీ రోటి, తందూరీ రోటి వంటి వాటిని తినే అలవాటు ఉంటుంది.అవి చాలా రుచికరంగా ఉంటాయి కూడా.ఇక గోధుమ పిండితో తయారు చేసినవే అయితే వాటిని తినడంవల్ల ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ పెద్దగా ఉండదు. కానీ, అవి మైదాతో తయారైనవి అయితే ఖచ్చితంగా ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.మైదాతో ఖచ్చితంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మైదా పిండి మెత్తదనం, తెల్లదనం కోసం చాలా ఎక్కువగా దాన్ని పాలిష్‌ చేస్తారు.క్లోరైడ్‌ గ్యాస్‌, బెంజయిల్‌ పెరాక్సైడ్‌ లాంటి కెమికల్స్ ని మిక్స్‌ చేస్తారు.ఇక అంతేగాక మైదాలో అల్లోక్సాన్‌ అనే విషపూరితమైన రసాయనం కూడా ఉంటుంది. ఈ రసాయనాలు ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.


ఈ మైదా పిండివల్ల కిడ్నీల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఇక మహిళలల్లో బ్రెస్ట్ కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. మైదాలో కేవలం పిండి పదార్థం మాత్రమే ఉండటంవల్ల పొట్ట కూడా చాలా వస్తుంది. ఇంకా అలాగే ఇందులో ప్రొటీన్‌లు కూడా నామమాత్రంగా ఉంటాయి.మైదాలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఒంట్లో షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది.ఇక ఈ మైదా పిండిని గోడలకు పోస్టర్లను అంటించడానికి చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ మైదాపిండిలోని జిగురు పోస్టర్ల గోడకు చాలా గట్టిగా అంటుకునేలా చేస్తుంది. మైదాతో చేసిన పదార్థాలను తిన్నప్పుడు ఖచ్చితంగా అవి మన పేగులకు  అలాగే అతుక్కుపోతాయి. దాంతో వాటిలో క్రిములు ఎక్కువై అనేక రకాల ఇన్ఫెక్షన్‌లను కలుగజేస్తాయి.మనం తిన్న ఆహారం జీర్ణం కావాలంటే అందులో తప్పనిసరిగా ఎంతోకొంత పీచు పదార్థం అనేది ఉండాలి. కానీ మైదాలో పీచుపదార్థం అనేది ఉండాలి. కాబట్టి మైదా అనేది త్వరగా జీర్ణం కాకుండా పేగుల్లో అలాగే పేరుకుపోతుంది. దీనివల్ల పేగుల్లో పుండ్లు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. అవి కనుక ముదిరితే ఖచ్చితంగా క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: