ఇక కొన్ని జాగ్రత్తలు, ఆహారపు నియమాలు పాటించడం వల్ల మధుమేహం సమస్యను చాలా ఈజీగా నియంత్రించవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించి నిశ్చింతగా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇక అందుకోసం మీరు కొన్ని రకాల ఔషధ గుణాలున్న ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆకులలోని ఔషధ గుణాలు శరీరంలోని చక్కెర స్థాయిలను చాలా ఈజీగా నియంత్రించి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. మరి అందుకోసం ఏ ఆకులను తీసుకోవాలో ఇప్పుడు  తెలుసుకుందాం..ఇక కరివేపాకులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు చాలా ఎక్కువ పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహం సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ కూడా ఈ ఆకులను  తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కరివేపాకు కళ్లకు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది.ఇంకా అలాగే మెంతికూరను కూడా ఆయుర్వేదంలో మంచి ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఆయుర్వేద నిపుణులు మెంతి ఆకులను మధుమేహ ఉన్నవారు ప్రతి రోజూ కూడా తీసుకోవాలని సూచిస్తారు.


ఇందుకోసం మెంతి ఆకులను కూరగాయ లేదా సలాడ్‌గా చేర్చుకుని ప్రతి రోజూ కనుక తింటే ఖచ్చితంగా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.కేవలం మామిడి కాయలు మాత్రమే కాకుండా మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా రకాలుగా మంచిదిని ఆయుర్వేద నిపుణులు పేర్కోన్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఈ ఆకులు కూడా చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం మీరు 10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకోవాలి. తరువాత వాటిని నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ తర్వాత రోజు వడకట్టి తాగాడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు ఖచ్చితంగా నియంత్రణలో ఉంటాయి.అలాగే వేప ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ వైరల్ సమ్మేళనాలు చాలా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి వేప ఆకులను తీసుకొని వాటిని ఎండబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌గా చేసుకోని ఆ పౌడర్‌ను ప్రతి రోజు ఒక చెంచ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: