కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తే చూడటానికి బాగుండొచ్చు. కానీ, వాటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ లెన్స్‌ల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఎక్కువ సేపు కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల కళ్లలో అలర్జీ సమస్యలు ఈజీగా వస్తాయి. దీని వల్ల దురద, మంట, కళ్ళ వెంట నీరు కారడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే గాలిలో ఉండే అలర్జీ కణాలు కాంటాక్ట్ లెన్స్‌లో చేరుతాయి. అందువల్ల కంటి సమస్యలు వస్తాయి.కళ్లు ఎర్రగా మారతాయి. ఈ కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల వచ్చే మరో సమస్య ఇది. కాంటాక్ట్ లెన్సులు ఎక్కువగా వాడటం వల్ల కళ్ళు ఖచ్చితంగా ఎర్రగా మారతాయి. అయితే బ్రాండెడ్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడితే ఎలాంటి సమస్య ఉండదని కాదు. ఏదైనా కాంటాక్ట్ లెన్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ కళ్లకు ఖచ్చితంగా హాని కలిగే అవకాశం ఉంది.అలాగే ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించడం వల్ల చూపు ఖచ్చితంగా మందగిస్తుంది.


ఇంకా అంతే కాదు అనేక కంటి వ్యాధులకు కూడా ఇది కారణం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వాడాలి. కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల కూడా కంటి ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. ఈ కాంటాక్ట్ లెన్స్ సరిగ్గా సరిపోకపోతే, కార్నియాపై రాపిడి జరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని ఖచ్చితంగా పెంచుతుంది.అలాగే ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్సులు ధరించడం వల్ల కళ్లలో నొప్పి వస్తుంది. కాంటాక్ట్ లెన్స్‌ల కారణంగా కంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. అందుకే సాధ్యమైనంత వరకు వాటిని ఉపయోగించకుండా ఉండటమే మంచిది. దీనివల్ల భవిష్యత్తులో ఖచ్చితంగా చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.మన కళ్లకు కూడా ఖచ్చితంగా తగినంత ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈ కాంటాక్ట్ లెన్స్‌లను కనుక ఎక్కువసేపు కళ్ళలో ఉంచుకుంటే, తరచుగా వాటిని ధరించి నిద్రపోతే.. మన కళ్ళకు ఆక్సిజన్ సరిగా అందదు. దాని ఫలితంగా చాలా సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: