
పెరుగు లేదా తేనె నోటి పూత ఉన్న ప్రదేశంలో రాసుకుంటే తక్కువ సమయంలోనే ఉపశమనం లభించే ఛాన్స్ అయితే ఉంది. కారంగా, పుల్లగా లేదా మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. క్రమం తప్పకుండా నోటిని శుభ్రం చేసుకోవడం, మృదువైన టూత్ బ్రష్ ఉపయోగించడం, యాంటీసెప్టిక్ మౌత్ వాష్‌ను ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చిన్న ఐస్ ముక్కను నోటి పూత ఉన్న ప్రదేశంలో నెమ్మదిగా రుద్దడం వల్ల నొప్పి, వాపు నుంచి తక్కువ సమయంలోనే ఉపశమనం లభిస్తుంది. లవంగం నూనె నొప్పిగా ఉన్న ప్రదేశంలో రాయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇది నోటి పూతను నయం చేయడంలో ప్రత్యక్షముగా, పరోక్షంగా తోడ్పడతాయి.
కొబ్బరి నూనెను నోటిలో రాసుకుని, కొంతసేపు ఉంచి, ఉమ్మేస్తే నొప్పి తగ్గడంతో పాటు మంచి ఫలితాలు ఉంటాయి. బేకింగ్ సోడాను నీటిలో కలిపి నోటిని శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా నోటిపూత సమస్య తక్కువ సమయంలోనే దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు