ఈ త‌రం పిల్ల‌ల‌కు చాలా మందికి కొన్ని పద్ధ‌తులు తెలియ‌డం లేదు. అందుకు పెద్ద‌వారు స‌రిగా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి. అమ్మ‌మ్మ‌, నాయ‌న‌మ్మ‌లు అంద‌రూ క‌లిసి ఉండ‌డంతో ఎలా ప్ర‌వ‌ర్తించాలి, ఎలా ఉండాలి. పెద్ద‌వారిని ఎలా గౌర‌వించాలి. ఇలాంటి విష‌యాల‌న్నీ నేర్పించేవారు. కానీ ప్ర‌స్తుతం త‌రం అలా ఉండ‌డం లేదు. ఎవ‌రి జీవితం వారిది లాగా ఉంటున్నారు. నా భార్య‌, నా పిల్ల‌లు అన్న‌ట్లు ఉండ‌డం వ‌ల్ల పిల్ల‌ల‌కు మంచిఏది, చెడు ఏది అని చెప్పేవాళ్ళే క‌రువ‌య్యారు. దాంతో ఆ బాధ్య‌త ఎక్కువ‌గా త‌ల్లిదండ్రుల మీద ఉంటుంది. కానీ నేటి త‌రంలో భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ బిజీగా ఉండ‌డంతో మంచి చెడులు నేర్పే అంత స‌మ‌యం వారికి ఉండ‌డం లేదు. 

 

ఒక‌ప్పుడు పిల్ల‌ల‌ని తీసుకుని ఎవ‌రింటికైనా వెళుతుంటే... ఇంట్లో ఉండ‌గానే వారికి వంద ర‌కాల కండీష‌న్లు చెప్పేవారు. అక్క‌డ అల్ల‌రి చెయ్య‌కూడ‌దు చ‌క్క‌గా ఉండాలి. అవి తీయ‌కూడ‌దు ఇవి తీయ‌కూడదు. అలాగే మంచిఏది, చెడు ఏది పెద్ద‌వాళ్ళ‌ను ఎలా గౌర‌వించాలి ఇలాంటివ‌న్నీ నేర్పించేవారు. అందులోనూ ఆడ‌పిల్ల‌ల‌కైతే ఆ కండీష‌న్స్ మ‌రీ ఎక్కువ‌గా ఉండేవి. ఎవ‌రింటికైనా వెళ్ళిన‌ప్పుడు చాలా అణ‌కువ‌గా ఉండాల‌ని. ఒక చోట కూర్చోవాల‌ని అలాగే అతిగా మాట్లాడ‌కూడ‌దని, పెద్ద‌గా న‌వ్వ‌కూడ‌ద‌ని ఇలా ర‌క ర‌కాలుగా చెప్పేవారు. కాని ఈ రోజుల్లో అవ‌న్నీ ఎవ్వ‌రూ చెప్ప‌డంలేదు. పిల్ల‌లు కూడా మంచి చెడు నేర్చుకోవ‌డం లేదు. 

 

మంచి చిన్న‌ప్ప‌టి నుంచి నేర్పించే ప‌ద్ధ‌తుల‌ను బ‌ట్టే వారు పెద్ద‌య్యాక మ‌న ప‌ట్ల‌గౌర‌వ‌మ‌ర్యాద‌ల‌తో అలాగే పెద్ద‌వాళ్ళ‌ను ఎలా చూసుకోవాలి ఎంత గౌర‌వంగా ఉండాలి అన్న విష‌యాలు తెలుస్తాయి. కానీ నేటి త‌రం త‌ల్లిదండ్రుల‌కి అంత స‌మ‌యం ఉండ‌డం లేదు. ఒక‌ప్పుడు ఒక్క‌రు సంపాదిస్తే మిగిలిన వారంతా ఇంట్లో కూర్చుని తినేవారు. కానీ నేడు ఇద్ద‌రూ క‌లిసి సంపాదిస్తేగాని కుద‌ర‌డం లేదు. దీంతో పిల్ల‌ల‌కు మంచి చెడు చెప్పేవారే క‌రువ‌య్యారు. ఇలాంట‌ప్పుడు పిల్ల‌ల‌కు ఎప్పుడు ఎక్క‌డ ఎలా మ‌సులుకోవాలో చాలా మందికి తెలియ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: