ఈతరం పిల్లలు చాలామంది ఎక్కువగా టీవీ చూడడం, లేదంటే ఫోన్ ఆడడం లాంటివి చేస్తున్నారు.అలాగే కంప్యూటర్ ముందు కూర్చోడం లాంటివి చేస్తున్నారు.ఇప్పుడు పరిస్థితిని బట్టి కరోనా సమయంలో చాలా మంది పిల్లలకు ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు ఇంకేముంది రోజంతా సిస్టమ్ కు అతుక్కుని పోతున్నారు. ఇలా గంటల తరబడి కంప్యూటర్ ముందుండటం వల్ల అలసట ఏర్పడి వారి కళ్ళు ఇబ్బందులకు గురవుతాయి.కళ్ళు అలసటకు గురైనప్పుడు కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడటం,విపరీతమైన తలనొప్పి రావటం జరుగుతుంది.యువతకు ఓ వైపు చదువు భారంగా తయారైంది.దానికి తోడు మొబైల్లో ఆటలు ఆడడం, వీడియోలు చూడడం కూడా ఎక్కువ అయిపొయింది. 



ఏ ప్రాజెక్ట్ చేయాలన్న వారు కంప్యూటర్ పైనే గంటల తరబడి గడపల్సి వస్తోంది.ఇంతేకాక జాబ్స్ లోనూ కంప్యూటర్ ముఖ్యమైన పాత్రను పోషించటం వల్ల గంటల తరబడి దృష్టిని కేంద్రీకరించటం వల్ల ఒత్తిడికి లోనై కళ్ళ క్రింద నల్లని వలయాలు,కళ్ళు జీవం లెకుండాపోవటం జరుగుతోంది.శారీరికంగా, మానసికంగా అలసట, చిన్న వయసులోనే కళ్ళ అద్దాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు.అలాగే  ఒత్తిడికి గురవుతున్నరు.కళ్ళకు సంబంధించిన నరాలు విపరీతమైన ఒత్తిదికి లోనై వారిని అసహనానికి గురిచేస్తుంది.అంతేకాక ఈ నరాలకు ఒత్తిడి కలిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి వస్తుంది.అంతేకాకుండా కళ్ళు మండటం,కళ్ళు పొడిబారిపోవటం, కంతి నుంచీ నీరు రావటం, మెద,భుజాలు నొప్పులు రావటం జరుగుతుంది.



అందుకనే ఎక్కువ సేపు ఫోన్లు, కంప్యూటర్ చూడడం మంచిది కాదు. చిన్న చిన్న విరామాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.అస్తమానం కంప్యూటర్ పూర్థి స్థాయిలో వాడేవారు గంటకోసారి పది నిముషాలు విరామం ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే టీవీ చేసేటపుడు దూరంగా కుర్చీని చూడాలి. రాత్రి అయ్యాక అసలు ఫోన్ చూడకూడదు. వీలయినంత ఎక్కువ సేపు నిద్రపోవాలి.చదువుకునేటప్పుడు పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిదే కానీ మిగతా టైమ్ లో కూడా ఫోన్ అలవాటు చేయడం మంచిది కాదు.. !

మరింత సమాచారం తెలుసుకోండి: