సాధారణంగా పండుగల సమయాలలో అమ్మవారికి నైవేద్యం పెట్టడం కోసం ముందురోజే శెనగలను నీటిలో నానబెడుతూ ఉంటాము. అంతే కాదు సాధారణ సమయాల్లో కూడా డైట్ ఫాలో అయ్యే ఎంతోమంది ఈ శెనగలను ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ శెనగల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖ్యంగా శెనగలను ముందుగా నానబెట్టి, ఆ తరువాత వాటిని ఉడకబెట్టి మనకు నచ్చిన ఏదో ఒక వంటకం ఉపయోగించుకుంటూ ఉంటాము. అయితే ఆ శెనగలు నానబెట్టిన నీళ్లను పడేస్తూ ఉంటాం..కానీ ఆ నీటిలోనే ఎక్కువ పోషక పదార్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.. చాలామందికి ఈ నీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక వాటిని పడేస్తూ ఉంటారు. అయితే శాఖాహారులు గుడ్డు బదులుగా ఈ నీటిని తాగవచ్చా అని నిపుణులు చెప్పడం కూడా జరిగింది.. అంతేకాదు మయోనీస్ చేయడానికి కూడా ఈ నీటిని ఉపయోగిస్తారట.


అయితే ఈ నీటి వల్ల మనకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీటి వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఒకసారి తెలుసుకుందాం.


అయితే దీనికోసం మీరు పెద్దగా శ్రమించి అక్కర్లేదు.. శెనగలు నీటిలో వేసి 4 నుండి 7 గంటల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టుకోవాలి అంతే శెనగలు నానబెట్టిన నీళ్లు రెడీ అవుతాయి.. ఒకవేళ మీరు శెనగలను ఉడకపెట్టుకోవాలి అనుకుంటే ఇదే నీళ్ళను కూడా ఉపయోగించుకోవచ్చు. నీటిలో ఉండే పోషక విలువలు కూడా మనకు లభిస్తాయి. ఈ నీటిలో విటమిన్ డి, ఫోలేట్, ఫాస్పరస్, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఈ నీటి వల్ల పిండి పదార్థం తో పాటు మంచి ప్రోటీన్స్ కూడా మన శరీరానికి లభిస్తాయి.. ఇకపై ఎవరైనా శెనగలు నానబెట్టిన నీటిని పడేస్తుంటే వారికి కూడా చెప్పండి ఈ నీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవేనని.
 


మరింత సమాచారం తెలుసుకోండి: