ఆది వారం రాత్రి నుంచి టాలీవుడ్ తో పాటు ఇత‌ర ఇండ‌స్ట్రీ లో ఉన్న ప‌లువురు సినీ న‌టీన‌టులు ద‌య్యాలు గా మారి త‌మ ఫోటో ల‌ను త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ ల ద్వారా త‌మ అభిమానుల‌తో పంచు కున్నారు. అంతే కాకుండా ఫోటో ల తో పాటు అంద‌రికీ హాలోవిన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే ప్ర‌తి ఏడాది అక్టొబ‌ర్ 31 రాత్రి నుంచి న‌వంబ‌ర్ 1 తేది వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా హాలోవిన్ ను జ‌రుపు కుంటారు. అయితే హాలోవిన్ ఎలా వ‌చ్చింది? ఈ హాలోవిన్ ను ఎందుకు జ‌రు పుకుంటారు అని మ‌నం తెలుసుకుందాం.



ప్ర‌తి ఏడాది కూడా అక్టొబ‌ర్ 31 న ఈ హాలో విన్ వేడుక‌ల‌ను జ‌రుపు కుంటారు. అయితే ఈ వేడుక ల‌ను ముందు గా పాశ్చ‌త్య దేశాల్లో జ‌రుపు కునే వారు. కాని ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లో జ‌రుపు కుంటున్నారు. ముందుగా ఈ హాలోవిన్ పండుగ ను రెండు వేల సంవ‌త్స‌రాల క్రితం ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో సెల్ట్స్ అనే జాతికి చెందిన వారు ఒక పండుగ ను జ‌రుపు కునే వారు. ఆ పండుగ పేరు సెల్టిక్ సంహెయిన్ అంటారు. ఈ సెల్టిక్ సంహెయిన్ నుంచే హాలోవిన్ అనే పండుగ వ‌చ్చింది. అయితే ఈ జాతి కి చెందిన వారి ప్ర‌కారం అక్టొబ‌ర్ 31 వ‌ర‌కు సంవ‌త్స‌రం ముగుస్తుంది. న‌వంబ‌ర్ 1 నుంచి కొత్త సంవ‌త్స‌రం ప్రారంభమ‌వుతుంది.



అంతే కాకుండా ఈ స‌మ‌యంలోనే అక్క‌డ వేస‌వి ముగుస్తుంది. అలాగే శీత‌కాలం ప్రారంభ‌మ‌వుతుంది. దీంతో అక్క‌డ ఆత్మ లు ఎక్కువ గా తిరుగు తాయ‌ని వారి న‌మ్మ‌కం. ఆ ఆత్మ‌లు త‌మ పంట‌ను, త‌మ జంతువుల‌ను చంపేస్తాయ‌ని వారు భ‌య‌ప‌డేవారు. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లు ద‌య్యాలు మాదిరి గానే రెడి అయి, వాటి లాగే విచిత్ర మైన దుస్తులు ధ‌రించి వాటిని భ‌య‌పెట్ట డానికి ప్ర‌య‌త్నం చేసే వారు. అలాగే త‌మ జంతువుల వ‌ద్ద కు, త‌మ పంట‌ల వ‌ద్ద కు ద‌య్య‌లు రాకుండా పెద్ద గా అరుస్తు పెద్ద పెద్ద మంట‌లు పెట్టె వారు. వీటి వ‌ల్ల ద‌య్యాలు త‌మ వ‌ద్ద‌కు రావ‌ని  ప్ర‌జ‌లు న‌మ్మె వారు.


కాలం గ‌డుస్తున్న కొద్ది ఈ హాలోవిన్ పండుగ ఆ మూడు దేశాలే కాకుండా ప్ర‌పంచ దేశాల‌కు విస్త‌రించింది. మ‌న దేశాల‌కు కూడా బ్రిటీష్ వారి కాలం లో విస్తిరించింది. అప్ప‌టి నుంచి మ‌న దేశం లో ఈ హాలోవిన్ పండుగ ను కొంత మంది చేస్తున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ గా ఈ హాలోవిన్ పండుగ జ‌రుపు కుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: