కార్తీకమాసంలో అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున వినాయకుడు, లక్ష్మీదేవికి ఒకేసారి పూజ చేయడం వలన సిరి సంపదలు, వెదజల్లుతాయి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు వెదజల్లుతాయి. ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవి భూమిని దర్శించుకునే ఎందుకు వస్తుంది అన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. అందుచేతనే ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.


ముఖ్యంగా ఈ రోజున బాణసంచాతో చాలా సందడి చేస్తూ ఉంటారు ప్రజలు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పూలతో, దీపాలతో బాగా అలంకరిస్తుంటారు. అమావాస్య రోజున కూడా వెలుగులతో ప్రకాశిస్తుంది. అయితే లక్ష్మీదేవ అనుగ్రహం కొందరు అంటే మనం పూజ చేసిన తర్వాత కొన్ని చోట్ల దీపాలను వెలిగించడం చాలా ముఖ్యమట ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1). ఈ రోజున కచ్చితంగా స్టోర్ రూమ్ లో దీపం వెలిగించాలట. మనం పండించిన ధాన్యాన్ని మొత్తం అక్కడ ఉంచుతాము కాబట్టి లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందట. ఇది చేయడం కచ్చితంగా మరువకూడదట.

2). ప్రతి ఒక్కరు తమ ఇంట్లో అష్టైశ్వర్యాలు కోసం పూజలు చేస్తూ ఉంటారు.. అందుకోసమే మనం డబ్బును ఎక్కడ ఉంచుతాము అక్కడ కూడా బయట వైపున ఒక దీపం వెలిగిస్తే మంచిదట.

3). మనం నడిపేటువంటి వాహనం  ముందు కూడా దీపం వెలిగించడం చాలా మంచిదట. ఇలా చేయడం వల్ల ఏదైనా ప్రమాదాల నుంచి మనమై కాపాడుతుంది అన్నట్లుగా కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

4). మన దగ్గర లోని ఏదైనా కొళాయి దగ్గర, భావి దగ్గర గాని ఈ దీపాలను వెలిగిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందని కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు.

5). మన ఇంటి పరిసరాలలో ఏదైనా గుడి ఉన్నట్లు అయితే అక్కడ కూడా దీపం పెట్టడం మంచిది. లేదంటే తమ ఇళ్లలోనే పూజగదిలో పెట్టవచ్చట.

ఇక ఇవే కాకుండా తులసి కోట దగ్గర, ఖచ్చితంగా ఒక దీపాన్ని ఎడమవైపుగా ఉంచడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: