ఒత్తిడి శరీరం, మెదడు రెండింటి పనితీరును భంగపరుస్తుంది. ఇది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. కాబట్టి వ్యాయామం, మెడిటేషన్, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు ఒత్తిడికి దూరంగా ఉండాలి.శరీరంలోని కాలేయం, అంతర్గత అవయవాలలో పేరుకుపోయే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఇది ఇన్సులిన్ నిరోధకతకు సంబంధించినదని తేలింది. దీని వల్ల మనిషి బరువు పెరగడం మొదలవుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో తక్కువ శరీర సూచిక ఉన్న వ్యక్తులు తక్కువ ప్రమాదం కలిగి ఉంటారు.అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాల లోపం అనేక వ్యాధులకు కారణమవుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆకు కూరలు, శాకాహారి, మిత ఆహారంతో మధుమేహం రాకుండా నిరోధించవచ్చని అనేక అధ్యయనాలు కనుగొన్నాయి. అలాగే, దీర్ఘకాలం పాటు విటమిన్ డి లోపం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రోటీన్లు, ఫైబర్, అవసరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి, ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.


అధిక ధూమపానం, మద్యపానం నేరుగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహంతో ముడిపడి ఉంటుంది. ధూమపానం రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. ధమనులను సంకోచిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య మొదలవుతుంది. ఇది డయాబెటిస్‌కు దారితీస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.వ్యాయామం చేయడం వల్ల శరీర శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే మీ కుటుంబంలో మధుమేహంతో బాధపడేవారు ఉంటే, వ్యాయామం చేయడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాంటి వారిలో మధుమేహం లక్షణాలు ఆలస్యంగా మొదలవ్వడమే కాకుండా రోగుల్లో షుగర్ లెవెల్ స్థాయిని మెయింటెన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు లేదా ఐదు రోజులు తప్పనిసరిగా వర్కవుట్‌లు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: